ఆసీస్ క్రికెటర్‌పై షేన్ వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ క్రికెటర్‌గా ఎంత పేరు సంపాదించాడో.. వివాదాల్లోనూ అంతే పేరు మూటగట్టుకున్నాడు. తాజాగా సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు మొదటి సెషన్‌లో వార్న్ మరో మాజీ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌తో కలిసి కామెంటరీ చేశాడు. ఈ సందర్భంగా ఆసీస్ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్‌పై వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు.
లబుషేన్ క్రీజులో చూపిస్తున్న మేనరిజమ్స్‌పై సైమండ్స్ ఏదో చెప్పగా..వార్న్ దానికి అడ్డుపడుతూ..'జీసస్..చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంది..మొదట బ్యాట్‌ను సరిగా పట్టుకోమను' అంటూ దూషించాడు. లబుషేన్‌పై వార్న్ చేసిన వ్యాఖ్యలను సైమండ్స్ సమర్థిస్తూ ఒక బూతు పదాన్ని ఉపయోగించాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను లెన్నీ పిలిఫ్స్ తన ట్విటర్‌లో షేర్ చేశాడు. వార్న్‌కు ఎవరైనా ఒక్కటే.. తనకు నచ్చకపోతే ప్రత్యర్థి ఆటగాళ్లను ఎంతలా ద్వేషిస్తాడో.. సహచర క్రికెటర్లను కూడా అదే తీరుతో చూస్తాడంటూ కామెంట్లు పెడుతున్నారు.(చదవండి: 'తొందరపడ్డావు.. కొంచెం ఆగుంటే బాగుండేది')
Ahh Kayo, thank you for this pic.twitter.com/Jy6PfTpvYK
— Lenny Phillips (@lenphil29) January 8, 2021
లెజెండరీ స్పిన్నర్‌గా పిలవబడే వార్న్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో చాలా ముందుంటాడు. తాను క్రికెట్ ఆడే సమయంలో స్టీవ్ వా, పాంటింగ్ కెప్టెన్సీలో ప్రత్యర్థి ఆటగాళ్లపై బాహంటగానే స్లెడ్జింగ్‌కు దిగేవాడు. ప్రొఫెషనల్‌గా మాత్రమే గాక వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నోసార్లు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఈ మధ్యనే టీమిండియా, ఆసీస్‌ల మధ్య తొలి టెస్టు సమయంలో చతేశ్వర్ పుజారాను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. పుజారా పేరు పలకడం తనకు ఇబ్బందిగా ఉంటుందని.. అందుకే అతన్ని స్టీవ్ అని పిలుస్తానని చెప్పాడు. దీనిపై సోషల్ మీడియాలో షేన్ వార్న్‌ను నెటిజన్లు ఒక రేంజ్‌లో ఆడుకున్నారు. దీంతో షేన్ వార్న్ దెబ్బకు దిగివచ్చి తాను చేసిన పనికి క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది.(చదవండి: రిషభ్ పంత్‌పై ట్రోలింగ్.. సైనీ తొలి వికెట్)
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు