ఎంఎస్‌ ధోని ఫన్నీ వాక్‌

MS Dhoni Funnily Walks Like Chris Gayle  - Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఆదివారం కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. పంజాబ్‌ నిర్దేశించిన 179 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా ఛేధించింది. షేన్‌ వాట్సన్‌ ఫామ్‌లోకి రావడంతో పాటు మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌ మళ్లీ రాణించడంతో సీఎస్‌కే 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. వాట్సన్‌(83 నాటౌట్‌; 53 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు ), డుప్లెసిస్‌(87 నాటౌట్‌; 53 బంతుల్లో 11 ఫోర్లు, 1సిక్స్‌)లు కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో సీఎస్‌కేకు తిరుగులేకుండా పోయింది. (చదవండి: అశ్విన్‌ ‘ఫైనల్‌ వార్నింగ్’‌.. పాంటింగ్‌కేనా?)

ఈ మ్యాచ్‌ తర్వాత యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ను సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని కలిశాడు.  గేమ్‌ ఆఫ్‌ ద స్పిరిట్‌లో భాగంగా ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరి నొకరు అభినందించుకునే క్రమంలో గేల్‌తో ధోని ముచ్చటించాడు. ఇక్కడ గేల్‌ను అనుకరించే యత్నం చేశాడు ధోని. గేల్‌  ఎలా నడుస్తాడో దాన్ని అతనే ఎదుటే చేసి నవ్వులు పూయించాడు.  దీనికి గేల్‌ కూడా నవ్వుకుంటా వచ్చి ధోనితో కాసేపు మాట్లాడాడు.  ఇద్దరూ ఒకర్నినొకరు విష్‌ చేసుకుని తర్వాత మ్యాచ్‌ విశేషాలను షేర్‌ చేసుకున్నారు. గేల్‌ను అనుకరిస్తూ ధోని నడిచిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఈ సీజన్‌లో ఇప్పటివరకూ క్రిస్‌ గేల్‌ ఇంకా మ్యాచ్‌ ఆడలేదు.  పంజాబ్‌ ఓపెనర్లగా మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌లు సెట్‌ కావడంతో గేల్‌ పనిలేకుండా పోయింది. కానీ వరుసగా పంజాబ్‌ ఓడిపోవడం కలవరపరుస్తోంది. మిడిల్‌ఆర్డర్‌లో మ్యాక్స్‌వెల్‌, కరుణ్‌ నాయర్‌, మన్‌దీప్‌ సింగ్‌లు విఫలం కావడంతో పంజాబ్‌ గెలవాల్సిన మ్యాచ్‌లను చేజార్చుకుంటుంది. అయితే మ్యాక్స్‌వెల్‌ స్థానంలో గేల్‌ను తీసుకోవాలనే వాదన వినిపిస్తోంది. గేల్‌ను రాహుల్‌కు జతగా ఓపెనర్‌గా పంపితే మయాంక్‌ను ఫస్ట్‌ డౌన్‌లో ఆడిస్తే పంజాబ్‌ బ్యాటింగ్‌ బ్యాటింగ్‌ గాడిలో పడుతుందని ఆ ఫ్రాంచైజీ అభిమానులు ఆశిస్తున్నారు.(చదవండి: ఇటు భువనేశ్వర్‌...అటు అమిత్‌ మిశ్రా)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top