IPL 2023 Finals: ఫైనల్‌కు ముందు సీఎస్‌కేకు బిగ్‌ షాక్‌.. ధోనిపై నిషేధం! ఏం జరగనుంది?

MS Dhoni to be banned for IPL 2023 Final? says reports - Sakshi

ఐపీఎల్‌-2023 ఫైనల్‌ బెర్త్‌ను చెన్నైసూపర్‌ కింగ్స్‌ ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. మే 28న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న తుది పోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ లేదా ముంబై ఇండియన్స్‌తో సీఎస్‌కే తలపడే ఛాన్స్‌ ఉంది. అయితే ఫైనల్‌కు ముందు చెన్నైకు బిగ్‌ షాక్‌ తగిలే అవకాశం ఉంది. సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిపై ఒక మ్యాచ్‌ నిషేదం పడే ఛాన్స్‌ ఉన్నట్లు క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి.

గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫియర్‌-1లో అంపైర్‌తో వాగ్వాదంకు దిగిన ధోని.. 4 నిమిషాల విలువైన సమయాన్ని వృథా చేశాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మ్యాచ్‌ రిఫరీ.. ధోనిపై ఫైన్‌ లేదా ఒక మ్యాచ్‌ నిషేధం విధించే అవకాశం ఉంది అని ఓ ప్రముఖ క్రీడా వెబ్‌సైట్‌ వెల్లడించింది.

అదేవిధంగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఈ విషయంపై ఆరాతీసునట్లు సమాచారం.  ఒకవేళ నిషేదం పడి కీలకమైన ఫైనల్‌కు ధోని దూరమైతే సీఎస్‌కే గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. అయితే తుది నిర్ణయం మ్యాచ్‌ రిఫరీపైనే ఆదారపడి ఉంటుంది.

ఏం జరిగిందంటే?
గుజరాత్‌ ఇన్నింగ్స్‌ 16 ఓవర్‌ వేసేందుకు సీఎస్‌కే మతీషా పతిరాణా సిద్దమయ్యాడు. కానీ పతిరాణా బౌలింగ్‌ చేయడానికి ఫీల్డ్‌ అంపైర్‌లు క్రిస్ గఫానీ, అనిల్ చౌదరి అంగీరించలేదు. దానికి కారణం లేకపోలేదు. ఈ ఓవర్‌ వేసేముం‍దు పతిరాణా దాదాపు 9 నిమిషాలు మైదానంలో లేడు.  డైరక్ట్‌గా డగౌట్‌ నుంచి బౌలింగ్‌ చేయడానికి సిద్దపడిన అతడిని  అంపైర్‌లు అడ్డుకున్నారు. రూల్స్‌ ప్రకారం మైదానంలో లేకుండా అలా నేరుగా వచ్చి బౌలింగ్‌ చేయకూడదు.

ఈ క్రమంలో ధోని అంపైర్‌లు వద్దకు వచ్చి వాగ్వాదంకు దిగాడు. ఆఖరికి ధోని అంపైర్‌లును ఒప్పించడంతో పతిరాణా ఆఓవర్‌ను కొనసాగించాడు. కాగా ఐపీఎల్‌ రూల్స్‌ ప్రకారం.. ఓ ఆటగాడు మ్యాచ్ జరిగే సమయంలో ఎనిమిది నిమిషాలకు పైగా గ్రౌండ్లో లేకపోతే అతనిపై నిబంధనలు విధించే ఛాన్స్ అంపైర్లకు ఉంది. అది బౌలింగ్‌ లేదా బ్యాటింగ్‌లోనైనా అవ్వవచ్చు. 
చదవండిCSK Vs GT: ఓడిపోయాం అంతే.. సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు! మళ్లీ సీఎస్‌కేతోనే: హార్దిక్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top