పోరాడి ఓడిన బోపన్న–జేమీ ముర్రే జంట | Monte Carlo Masters: Rohan Bopanna/Jamie Murray defeats in semifinal | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన బోపన్న–జేమీ ముర్రే జంట

Apr 17 2022 5:45 AM | Updated on Apr 17 2022 5:45 AM

Monte Carlo Masters: Rohan Bopanna/Jamie Murray defeats in semifinal - Sakshi

మోంటెకార్లో ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నీలో రోహన్‌ బోపన్న (భారత్‌)–జేమీ ముర్రే (బ్రిటన్‌) జంట పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో బోపన్న–జేమీ ముర్రే ద్వయం 6–3, 6–7 (4/7), 9–11తో టాప్‌ సీడ్‌ జో సాలిస్‌బరీ (బ్రిటన్‌)–రాజీవ్‌ రామ్‌ (అమెరికా) జోడీ చేతిలో ఓడింది. బోపన్న–జేమీ ముర్రే జంటకు 76,560 యూరోల (రూ. 63 లక్షల 19 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 360 పాయింట్లు లభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement