
Courtesy: IPL Twitter
ఐదు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్-2022లో పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోను ఓటమి చెంది పాయింట్ల పట్టికలో ముంబై అఖరి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో ఓ చెత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ సీజన్‌లో తొలి ఐదు మ్యాచ్‌ల్లో రెండుసార్లు ఓడిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చెందిన ముంబై ఈ చెత్త రికార్డును మూట కట్టుకుంది.
అంతకుముందు 2014 సీజన్‌లోనూ తొలి ఐదు మ్యాచ్‌లోను ముంబై ఓటమి పాలైంది. ఇక ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పరాజాయం పాలైంది. 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 186 పరుగుల మాత్రమే చేయగల్గింది. బ్రేవిస్(49), సుర్యకుమార్ యాదవ్(43) అద్భుత ఇన్నింగ్స్‌లతో ముంబై విజయంపై ఆశలు రేకెత్తించనప్పటికీ.. అఖరిలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఓటమి తప్పలేదు.
పంజాబ్ బౌలర్లలో ఓడియన్ స్మిత్ 4, రబాడ 2, వైభవ్ అరోరా ఒక వికెట్ తీశాడు. అంతకుమందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ధావన్(70), మయాంక్ అగర్వాల్(52), జితేష్ కుమార్(30) పరుగులతో రాణించారు.
చదవండి: IPL 2022: ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్!