అంచనాలు లేకుండా బరిలోకి.. స్విచ్‌హిట్‌తో మ్యాక్సీ విన్నింగ్‌ షాట్‌

Maxwell Switch Hit Australia Lift T20 World 2021 Without Expectation - Sakshi

Maxwell Swith Hit Winning Shot Became Viral.. టి20 ప్రపంచకప్‌ 2021 విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన సంగతి తెలిసిందే. వన్డే క్రికెట్‌లో రారాజుగా ఉన్న ఆస్ట్రేలియాకు పొట్టి ఫార్మాట్‌ అంతగా కలిసిరాలేదు. 2007 తొలి టి20 ప్రపంచకప్‌ నుంచి చూసుకుంటే ఒక్కసారి కూడా ఆస్ట్రేలియా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. 2010 టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరినప్పటికి ఇంగ్లండ్‌ చేతిలో పరాభవం ఎదురైంది.


తాజా ప్రపంచకప్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆసీస్‌ ఏకంగా కప్‌ను ఎగురేసుకుపోయింది. ఇక మిచెల్‌ మార్ష్‌, డేవిడ్‌ వార్నర్‌ మెరుపులతో సులువుగానే లక్ష్యం దిశగా నడిచింది. ఇక చివర్లో మ్యాక్స్‌వెల్‌ స్విచ్‌హిట్‌తో విన్నింగ్‌ షాట్‌ కొట్టి ఆస్ట్రేలియాను గెలిపించడం హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top