T20 WC 2021 Final: ఎడమ పక్కన నిల్చున్న కెప్టెన్‌దే ట్రోఫీ

T20 World Cup 2021: Team Captain Who Stands ICC Trophy Left Side Won Final - Sakshi

Team Captain Who Stands Title Left Side Won Final Match.. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న  ఫైనల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఈ విషయం పక్కనపెడితే  ఫైనల్లో తలపడనున్న జట్ల కెప్టెన్లలో ఎవరైతే ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చుంటారో​ వారిదే విజయం అని జోస్యం చెబుతున్నారు. వినడానికి సిల్లీగా ఉన్నా చరిత్ర మాత్రం ఇదే చెబుతుంది. వన్డే వరల్డ్‌కప్‌, టి20 ప్రపంచకప్‌, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలాంటి మేజర్‌ ఐసీసీ టోర్నీల్లో చాలా సందర్భాల్లో ఇది చోటుచేసుకుంది. ఒకసారి వాటిని పరీశిలిద్దాం.  

చదవండి: David Warner: రెండు సిక్సర్లు.. 30 పరుగులు; వార్నర్‌ ముంగిట అరుదైన రికార్డు

 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ టీమిండియా, శ్రీలంక మధ్య జరిగింది.  అక్కడ ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చున్న ధోనికి విజయం వరించింది.

 2015 వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తలపడ్డాయి. ఇందులో ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చును మైకెల్‌ క్లార్క్‌ విజయం అందుకున్నాడు. 

 2016 టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ తలపడ్డాయి. ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చున్న డారెన్‌ సామి టైటిల్‌ అందుకున్నాడు.

 2017 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ పాకిస్తాన్‌, టీమిండియా మధ్య జరిగింది. ట్రోఫీకి ఎడమపక్కన నిల్చున్న సర్ఫరాజ్‌ అహ్మద్‌ విజేతగా నిలిచాడు. 

చదవండి: T20 WC 2021: 'దుబాయ్' చేజింగ్‌ కింగ్‌; టాస్‌ గెలిస్తే బౌలింగ్‌ ఎంచుకోవడం ఖాయం

 2019 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ సందర్భంగా ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చున్న ఇయాన్‌ మోర్గాన్‌ను విజయం వరించింది.

 2021లో తొలిసారి నిర్వహించిన ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ట్రోఫీకి ఎడమ పక్కన నిల్చున్న కేన్‌ విలియమ్సన్‌ విజయం సాధించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top