
కేంద్ర ప్రభుత్వంలో కొత్త క్రీడల మంత్రిగా నియమితులైన మన్‌సుఖ్ మాండవియా మంగళవారం న్యూఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా ప్రపంచంలో భారత్‌ను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని వ్యాఖ్యానించారు.
52 ఏళ్ల మన్‌సుఖ్ గుజరాత్‌లోని పోర్‌బందర్ లోకసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. గత ప్రభుత్వంలో క్రీడా శాఖ మంత్రిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ ఈసారి ఎన్నికల్లో నెగ్గినా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.