Malaysia Open 2023: సెమీస్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ | Malaysia Open 2023: Satwiksairaj And Chirag Shetty Reach Semi Final | Sakshi
Sakshi News home page

Malaysia Open 2023: సెమీస్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ

Jan 14 2023 10:48 AM | Updated on Jan 14 2023 10:48 AM

Malaysia Open 2023: Satwiksairaj And Chirag Shetty Reach Semi Final - Sakshi

కౌలాలంపూర్‌: మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఏడో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ ద్వయం 17–21, 22–20, 21–9తో లియు యు చెన్‌–జువాన్‌ యి ఒయు (చైనా) జోడీపై విజయం సాధించింది.

పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌ ప్రణయ్‌ 16–21, 21–19, 12–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ కొడాయ్‌ నరోకా (జపాన్‌) చేతిలో ఓడిపోయాడు. ప్రణయ్‌కు 6,875 డాలర్ల (రూ. 5 లక్షల 60 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6,600 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement