IPL 2022: Tymal Mills Said Looking Forward to Playing With Jasprit Bumrah at Mumbai Indians - Sakshi
Sakshi News home page

IPL 2022 : "బుమ్రాతో కలిసి బౌలింగ్ చేసే అవకాశం రావడం నా అదృష్టం"

Mar 14 2022 1:26 PM | Updated on Jun 9 2022 6:58 PM

Looking forward to playing with Jasprit Bumrah at Mumbai Indians Says Tymal Mills - Sakshi

ఐపీఎల్‌-2022 మెగా వేలంలో ఇంగ్లండ్‌ పేసర్‌ టైమల్ మిల్స్‌ను రూ. 1.5 కోట్లకు  ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ జట్టు స్టార్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ స్ధానంలో మిల్స్‌ను ముంబై కొనుగోలు చేసింది. అయితే మరో పేసర్‌ ఆర్చర్‌ అందుబాటుపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో జస్ప్రీత్‌ బుమ్రాతో పేస్ బౌలింగ్‌ను పంచు కోనున్నాడు. ఇది ఇలా ఉంటే.. బుమ్రాపై మిల్స్‌ ఆసక్తికర వాఖ్యలు చేశాడు

జస్ప్రీత్‌ బుమ్రాతో కలిసి బౌలింగ్ చేసే అవకాశం రావడం తన ఆదృష్టమని మిల్స్‌ తెలిపాడు. "టీ 20 ప్రపంచకప్ సమయంలో బుమ్రాతో కొద్దిసేపు గడిపే అవకాశం వచ్చింది. అయితే ఇప్పుడు అతనితో కలిసి ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఇక చాలా కాలం తరువాత ఐపీఎల్‌లో ఆడబోతున్నాను. నాకు మళ్లీ ఆడే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది" అని ముంబై ఇండియన్స్ పోస్ట్ చేసిన వీడియోలో మిల్స్‌ పేర్కొన్నాడు.

ఇక టీ20 స్పెషలిస్ట్‌గా పేరొందిన మిల్స్.. 12 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. మిల్స్‌ 2017లో ఆర్సీబీ తరుపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఇక ఐపీఎల్‌-2022 మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ముంబై జట్టు మాత్రమే హోం గ్రౌండ్‌లలో మ్యాచ్‌లు ఆడనుంది. వాంఖడే వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తలపడనుంది.

చదవండి: Ind VS Sl 2nd Test: ఛ.. నాకే ఎందుకిలా జరుగుతోంది? కోహ్లి వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement