శైలీ సింగ్‌కు కాంస్య పతకం

Long Jumper Shaili Singh Won Bronze Medal Seiko Golden Grand Prix - Sakshi

సేకో గోల్డెన్‌ గ్రాండ్‌ప్రి అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ మీట్‌లో భారత యువ లాంగ్‌జంపర్‌ శైలీ సింగ్‌ కాంస్య పతకం సాధించింది. జపాన్‌లోని యోకోహామాలో ఆదివారం జరిగిన ఈ మీట్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల శైలీ 6.65 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచింది.

అంతర్జాతీయ సీనియర్‌ స్థాయిలో శైలికిదే తొలి టోర్నీ. భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) హై పర్ఫార్మెన్స్‌ కోచ్‌ రాబర్ట్‌ బాబీ జార్జి వద్ద శిక్షణ తీసుకుంటున్న శైలీ 2021లో ప్రపంచ అండర్‌–20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం దక్కించుకొని వెలుగులోకి వచ్చింది.  

హారిక గేమ్‌ ‘డ్రా’ 
నికోసియా (సైప్రస్‌): మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక నాలుగో ‘డ్రా’ నమోదు చేసింది. కాటరీనా లాగ్నో (రష్యా)తో ఆదివారం జరిగిన ఆరో రౌండ్‌ గేమ్‌ను హారిక 85 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ప్రస్తుతం హారిక నాలుగు పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉంది 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top