
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో గాయపడిన ఆటగాళ్ల సంఖ్య చాలా పెద్దగా ఉంది. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈ సీజన్‌లో 17 మంది ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. వీరికి ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఆయా జట్లు ఇదివరకే ప్రకటించాయి.
ప్రత్యామ్నాయ ఆటగాళ్లుగా వచ్చిన వారిలో చాలా మంది తుది జట్లలో చోటు దక్కించుకుని మ్యాచ్‌లు ఆడారు. కొందరికి ఇంకా అవకాశాలు రాలేదు. సీజన్ ప్రారంభానికి ముందే గాయాల కారణంగా వైదొలిగిన వారిలో హ్యారీ బ్రూక్, ఉమ్రాన్ మాలిక్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. మిగిలిన ఆటగాళ్లు సీజన్ మధ్యలో గాయపడి లీగ్ నుంచి వైదొలిగారు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి గాయాల కారణంగా వైదొలిగిన ఆటగాళ్లు..
ఆర్సీబీ
దేవ్‌దత్ పడిక్కల్- మయాంక్ అగర్వాల్ (రీప్లేస్‌మెంట్)
సీఎస్‌కే
రుతురాజ్ గైక్వాడ్- ఆయుశ్ మాత్రే
గుర్జప్‌నీత్ సింగ్- డెవాల్డ్ బ్రెవిస్
వన్ష్ బేడి- ఉర్విల్ పటేల్
ముంబై ఇండియన్స్
అల్లా ఘజన్‌ఫర్- ముజీబ్ రెహ్మాన్
లిజాడ్ విలియమ్స్- కార్బిన్ బాష్
విజ్ఞేశ్ పుతుర్- రఘు శర్మ
కేకేఆర్
ఉమ్రాన్ మాలిక్- చేతన్ సకారియా
గుజరాత్ టైటాన్స్
గ్లెన్ ఫిలిప్స్- దసున్ షనక
పంజాబ్ కింగ్స్
గ్లెన్ మ్యాక్స్‌వెల్- మిచెల్ ఓవెన్
లక్నో సూపర్ జెయింట్స్
మొహిసిన్ ఖాన్- శార్దూల్ ఠాకూర్
ఎస్‌ఆర్‌హెచ్
బ్రైడన్ కార్స్- వియాన్ ముల్దర్
ఆడమ్ జంపా- స్మరణ్ రవిచంద్రన్
స్మరణ్ రవిచంద్రన్- హర్ష్ దూబే
ఢిల్లీ క్యాపిటల్స్
హ్యారీ బ్రూక్- సెదిఖుల్లా అటల్
రాజస్థాన్ రాయల్స్
నితీశ్ రాణా- లుహాన్ డ్రి ప్రిటోరియస్
సందీప్ శర్మ- నండ్రే బర్గర్
రీప్లేస్‌మెంట్ ఆటగాళ్ల ద్వారా అత్యధిక లబ్ది పొందింది సీఎస్‌కే. రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన ఆయుశ్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్ జట్టులో స్థిరపడిపోయారు. వచ్చీ రావడంతోనే అవకాశం దక్కించుకున్న ఉర్విల్ పటేల్ కూడా తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు.