హామిల్టన్‌... పోల్‌ @ 98 | Lewis Hamilton delights in his 98th career pole at Bahrain F1 GP | Sakshi
Sakshi News home page

హామిల్టన్‌... పోల్‌ @ 98

Nov 29 2020 6:33 AM | Updated on Nov 29 2020 6:33 AM

Lewis Hamilton delights in his 98th career pole at Bahrain F1 GP - Sakshi

సాఖిర్‌ (బహ్రెయిన్‌): ఇప్పటికే ప్రపంచ డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ ఖాయమైనప్పటికీ మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ జోరు తగ్గించడం లేదు. ఈ సీజన్‌లో పదోసారి... కెరీర్‌లో 98వ సారి ఈ బ్రిటన్‌ డ్రైవర్‌ పోల్‌ పొజిషన్‌ సాధించాడు. శనివారం జరిగిన బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ సెషన్‌లో 34 ఏళ్ల హామిల్టన్‌ అందరికంటే వేగంగా ఒక నిమిషం 27.264 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే పది రేసుల్లో విజేతగా నిలిచిన హామిల్టన్‌ 11వ రేసు టైటిల్‌ వేటలో ఉన్నాడు. మెర్సిడెస్‌కే చెందిన వాల్తెరి బొటాస్‌ రెండో స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు.  

గ్రిడ్‌ పొజిషన్స్‌: 1. హామిల్టన్‌ (మెర్సిడెస్‌), 2. బొటాస్‌ (మెర్సిడెస్‌), 3. వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌), 4. ఆల్బోన్‌ (రెడ్‌బుల్‌), 5. పెరెజ్‌ (రేసింగ్‌ పాయింట్‌), 6. రికియార్డో (రెనౌ), 7. ఒకాన్‌ (రెనౌ), 8. గాస్లే (అల్ఫా టౌరి), 9. నోరిస్‌ (మెక్‌లారెన్‌), 10. క్వియాట్‌ (అల్ఫా టౌరి), 11. వెటెల్‌ (ఫెరారీ), 12. లెక్‌లెర్క్‌ (ఫెరారీ), 13. లాన్స్‌ స్ట్రాల్‌ (రేసింగ్‌ పాయింట్‌), 14. రసెల్‌ (విలియమ్స్‌), 15. సెయింజ్‌ (మెక్‌లారెన్‌), 16. గియోవినాజి (అల్ఫా రోమియో), 17. రైకోనెన్‌ (అల్ఫా రోమియో), 18. మాగ్నుసెన్‌ (హాస్‌), 19. గ్రోస్యెన్‌ (హాస్‌), 20. లతీఫీ (విలియమ్స్‌).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement