ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన తెలుగమ్మాయి

Jyothi Surekha Vennam Moves To Third Rank In World Archery Rankings - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ మహిళా స్టార్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో నిలిచింది. సోమవారం విడుదల చేసిన ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో విజయవాడకు చెందిన 25 ఏళ్ల జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌ను అందుకుంది. కాంపౌండ్‌ విభాగంలో ఓ భారత ఆర్చర్‌ మూడో ర్యాంక్‌లో నిలువడం ఇదే ప్రథమం. సురేఖ ఖాతాలో ప్రస్తుతం 188.45 పాయింట్లు ఉన్నాయి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top