ఇంగ్లండ్ కొత్త టెస్ట్ కోచ్‌గా ఆస్ట్రేలియా దిగ్గజం? | Justin Langer likely to leave LSG for England job | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ కొత్త టెస్ట్ కోచ్‌గా ఆస్ట్రేలియా దిగ్గజం?

Jul 21 2026 8:57 PM | Updated on Jul 21 2026 8:59 PM

Justin Langer likely to leave LSG for England job

ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి బ్రెండన్ మెకల్లమ్ వైదొలిగన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్ధానాన్ని భర్తీ చేసేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) తమ వేటను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, దిగ్గజ కోచ్ జస్టిన్ లాంగర్ పేరు దాదాపుగా ఖారైనట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ.. లాంగర్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. తమ హెడ్‌కోచ్‌గా లాంగర్‌ను నియమించాలని ఈసీబీ భావిస్తున్నప్పటికి.. అతడి ఫ్రాంచైజీ ఒప్పందాలు ఇందుకు అడ్డంకిగా మారినట్లు వార్తలు వస్తున్నాయి.

లాంగర్ ప్రస్తుతం ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్, 'ది హండ్రెడ్' టోర్నీలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ జట్ల​కు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్ జాతీయ జట్టు బాధ్యతలు స్వీకరిస్తే ఈ కాంట్రాక్టుల నుంచి అతడు తప్పుకోవాల్సి ఉంటుంది. 

అయితే ఈసీబీతో చర్చలు కొలిక్కి వస్తే లక్నో ఫ్రాంచైజీతో తన బంధాన్ని తెంచుకోవడానికి లాంగర్ సిద్ధంగా ఉన్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కాగా తొలుత ఈ రేసులో జింబాబ్వే దిగ్గజం ఆండీ ఫ్లవర్ పేరు వినిపించింది. ఫ్లవర్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు హెడ్ కోచ్‌గా ఉంటూ 2025, 2026 లలో వరుసగా బ్యాక్-టు-బ్యాక్ టైటిల్స్ అందించాడు.

గతంలో ఇంగ్లండ్‌ను కూడా టెస్టుల్లో నంబర్ వన్ జట్టుగా తీర్చిదిద్దాడు. దీంతో అతడిని తిరిగి ప్రధాన కోచ్‌గా నియమించాలని ఇంగ్లండ్ క్రికెట్ పెద్దలు భావించారు. కానీ ఫ్లవర్ మాత్రం అందుకు సముఖత చూపలేదు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో కోచింగ్‌తో తను సంతృప్తిగా ఉన్నాని ఈసీబీకి ఫ్లవర్ తెలియజేశాడు. వచ్చే నెలలో పాకిస్తాన్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లీష్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ రానున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement