T20 WC ENG VS AFG: క్యాచెస్‌ విన్‌ మ్యాచెస్‌ అంటే ఇదేనేమో.. బట్లర్‌, లివింగ్‌స్టోన్‌ కళ్లు చెదిరే క్యాచ్‌లు

Jos Buttler, Liam Livingstone Takes Catches Of The Tournament In Afghanistan Vs England Match - Sakshi

క్యాచెస్‌ విన్‌ మ్యాచెస్‌ అనే నానాడు క్రికెట్‌ సర్కిల్స్‌లో చాలాకాలంగా వినపడుతూ ఉంది. అయితే ఈ నానాడు వంద శాతం కరెక్టేనని ఇవాళ (అక్టోబర్‌ 22) జరిగిన ఇంగ్లండ్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌ రుజువు చేసింది. టీ20 వరల్డ్‌కప్‌ గ్రూప్‌-1 సూపర్‌-12 మ్యాచ్‌ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ప్లేయర్లు జోస్‌ బట్లర్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌ పక్షుల్లా గాల్లోకి ఎగురుతూ కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకుని మ్యాచ్‌ను గెలిపించారు. క్యాచెస్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌ బరిలో నిలిచే అర్హత కలిగిన ఈ క్యాచ్‌లు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.

ముందుగా లివింగ్‌స్టోన్‌ పట్టిన క్యాచ్‌ విషయానికొస్తే.. బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో ఆఫ్ఘన్‌ ఓపెనర్‌ హజ్రతుల్లా జజాయ్‌ కొట్టిన భారీ షాట్‌ను బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ వద్ద లివింగ్‌స్టోన్‌ అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. చాలా సేపు గాల్లో ఉన్న బంతిని లివింగ్‌స్టోన్‌ ముందుకు పరిగెడుతూ సూపర్‌మ్యాన్‌లా గాల్లోకి ఎగురుతూ రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. 

ఇక జోస్‌ బట్లర్‌ పట్టిన క్యాచ్‌ విషయానికొస్తే.. ఈ క్యాచ్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌ అని చెప్పాలి. మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో ఆఫ్ఘన్‌ కెప్టెన్‌ మహ్మద్‌ నబీ లెగ్‌ గ్లాన్స్‌ షాట్‌ ఆడాలని ప్రయత్నించగా.. బంతి ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌కీపర్‌ బట్లర్‌ను క్రాస్‌ చేయబోయింది. ఇంతలో బట్లర్‌ పక్షిలా తన లెఫ్ట్‌ సైడ్‌కు డైవ్‌ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్నాడు. ఈ క్యాచ్‌ తప్పక క్యాచ్‌ ఆఫ్‌ టోర్నమెంట్‌ అవుతుందని నెటిజన్లు అంటున్నారు. లివింగ్‌స్టోన్‌, బట్లర్‌ పట్టిన క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. 

ఇవే కాక.. న్యూజిలాండ్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళే జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ ప్లేయర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ సైతం ఒళ్లు జలదరించే క్యాచ్‌ అందుకున్నాడు. ఈ క్యాచే ఈ రోజు మొత్తానికి హైలైట్‌ అనుకుంటే మరో రెండు క్యాచ్‌లు దీనికి పోటీగా వచ్చాయి. ఇదిలా ఉంటే, గ్రూప్‌-1లో ఇవాళ జరిగిన మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌.. ఆసీస్‌పై, ఇంగ్లండ్‌.. ఆఫ్ఘనిస్తాన్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే.  

   

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top