టాప్‌-10లోకి బుమ్రా.. దూసుకొస్తున్న శార్దూల్‌  | Jasprit Bumrah Moves Up To Ninth Spot In ICC Test Rankings | Sakshi
Sakshi News home page

ICC Test Rankings: టాప్‌-10లోకి బుమ్రా.. దూసుకొస్తున్న శార్దూల్‌ 

Sep 9 2021 8:35 PM | Updated on Sep 9 2021 8:35 PM

Jasprit Bumrah Moves Up To Ninth Spot In ICC Test Rankings - Sakshi

దుబాయ్‌: టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్‌-10లోకి ప్రవేశించాడు. ఓవల్‌ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత స్పెల్‌తో ఇంగ్లండ్‌ వెన్నువిరిచిన బుమ్రా.. 771 రేటింగ్‌ పాయింట్లతో ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో ఆసీస్‌ ప్యాట్‌ కమిన్స్‌(908) నంబర్‌వన్‌ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(831), న్యూజిలాండ్‌ టిమ్‌ సౌథీ(824) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే..

ఈ జాబితాలో ఇంగ్లండ్‌ సారధి జో రూట్‌(903) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కివీస్‌ కేన్‌ విలియమ్సన్‌(901), ఆసీస్‌ స్టీవ్‌ స్మిత్‌(891) రెండు, మూడు ర్యాంక్‌ల్లో నిలిచారు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో సూపర్‌ శతకంతో చెలరేగిన టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(813).. తన రేటింగ్‌ పాయింట్లను భారీగా పెంచుకున్నప్పటికీ ఐదో స్థానానికే పరిమితయ్యాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(783) ఆరో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఓవల్‌ టెస్టులో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అదరగొట్టిన శార్దూల్‌ ఠాకూర్‌.. రెండు విభాగాల్లో తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకుని టాప్‌-10 దిశగా దూసుకొస్తున్నాడు. బ్యాటింగ్‌లో 79, బౌలింగ్‌లో 49వ ర్యాంకుకు ఎగబాకాడు.
చదవండి: సరికొత్త అవతారంలో ట్రంప్‌.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికన్లు

Advertisement
 
Advertisement
Advertisement