మేయర్‌ అత్యుత్సాహం.. పంటి గాట్లతో గోల్డ్‌ మెడల్‌ రీప్లేస్‌

Japan Mayor Bites Olympic Gold Medal And It Will Be Replaced - Sakshi

సాధారణంగా ఒలింపిక్స్‌ మెడల్స్‌ సాధించి.. ఫొటోగ్రాఫర్ల ఫోజుల కోసం పంటిగాట్లు పెట్టినట్లు అథ్లెట్లు నటించడం చూస్తున్నదే. కానీ, ఓ మేయర్‌ అతి వల్ల జపాన్‌లో రాజకీయ దుమారం చెలరేగింది. అథ్లెట్‌ నుంచి మెడల్‌ అందుకుని.. కసితీరా పంటితో గాట్లు పెట్టాడు ఆయన. ఈ చర్యకతో ఆయనకి వ్యతిరేకంగా ఏడు వేల ఫిర్యాదులు రావడం విశేషం. 

సాఫ్ట్‌ బాల్‌ ప్లేయర్‌ మియూ గోటో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం కైవసం చేసుకుంది. సంబురాల్లో భాగంగా సొంత వూరు జపాన్‌ సెంట్రల్‌ సిటీ నయోగాలో జరిగిన ఓ ఈవెంట్‌కి ఆమె హాజరైంది. అక్కడే ఆ నగర మేయర్‌ టకాషి కవామురా అత్యుత్సహం ప్రదర్శించాడు. ఆమె నుంచి గోల్డ్‌ మెడల్‌ను అందుకుని మెడలో వేసుకున్న కవామురా.. తన ముఖానికి ఉన్న మాస్క్‌ కిందకి లాగేసి మరీ ఆ గోల్డ్‌ మెడల్‌ను గట్టిగా కొరికేశాడు. మెడల్‌పై పంటిగాట్లు బలంగా పడ్డాయి. ఈవెంట్‌ తర్వాత ఆ డ్యామేజ్‌ చూసి ఆందోళన చెందిన మియూ వెంటనే టోక్యో ఒలింపిక్స్‌ నిర్వాహకుల్ని సంప్రదించింది. 

చదవండి: గ్రేటెస్ట్‌ జాబితాలో బల్లెం వీరుడి ప్రదర్శన

ఇక టోక్యో నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ఆ మెడల్‌ను మార్చేందుకు ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ మార్చడానికి సుముఖత వ్యక్తం చేసింది. అంతేకాదు ఆ మెడల్‌ మార్పిడికి అయ్యే ఖర్చును ఐవోసీనే భరించబోతోంది. మరోవైపు కరోనా టైంలో మాస్క్‌ తీసేసి నిర్లక్క్ష్యంగా వ్యవహరించడం, పైగా ఆమె విజయాన్ని అగౌరవపర్చడం తీవ్ర నేరాలంటూ మేయర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెతున్నాయి. ఈ తరుణంలో తన స్థాయిని మరిచి ప్రవర్తించిన తీరుకు టకాషి కవామురా క్షమాపణలు తెలియజేశాడు. 

ఆమెకు కృతజ్ఞతలు
ఒక టోక్యో ఒలింపిక్స్‌ వేదికగా మరో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. జమైకా హర్డ్‌లింగ్‌ అథ్లెట్‌ హన్‌స్లే పర్చమెంట్‌ 110 మీటర్ల  రేసులో స్వర్ణం సాధించాడు. అయితే రేసుకి ముందు పొరపాటున వేరే వేదిక దగ్గరికి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న వలంటీర్‌ ఒకామె.. జరిగిన పొరపాటును గుర్తించి సరైన వేదిక దగ్గరికి వెళ్లడం కోసం హన్‌స్లేకి డబ్బులిచ్చి మరీ సాయం చేసింది.

దీంతో డిస్‌క్వాలిఫైయింగ్‌ను తప్పించుకుని అతను అర్హత సాధించడం, ఆపై ఫైనల్‌ రేసులో గోల్డ్‌ సాధించాడు. ఇక తన విజయానికి మూల కారణమైన ఆ వలంటీర్‌ను వెతుక్కుంటూ వెళ్లి మరీ కృతజ్ఞతలు తెలియజేశాడు ఈ జమైకన్‌ అథ్లెట్‌.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top