ప్రిక్వార్టర్స్‌లో ప్రత్యూష  | ITF Tourney: Prathyusha Enters Pre Quarters Beating Avishka Gupta | Sakshi
Sakshi News home page

ITF Tournament: ప్రిక్వార్టర్స్‌లో ప్రత్యూష 

Mar 2 2022 1:58 PM | Updated on Mar 2 2022 1:58 PM

ITF Tourney: Prathyusha Enters Pre Quarters Beating Avishka Gupta - Sakshi

నాగ్‌పూర్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి ప్రత్యూష రాచపూడి శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రత్యూష 6–2, 5–7, 6–3తో అవిష్క గుప్తా (భారత్‌)పై నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. హెదరాబాద్‌ అమ్మాయిలు హుమేరా, స్మృతి భాసిన్‌ కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు.

తొలి రౌండ్‌లో హుమేరా 6–3, 6–4తో కశిష్‌ (భారత్‌)ను ఓడించగా, స్మృతి 6–3, 6–1తో ఎనిమిదో సీడ్‌ మిహికా యాదవ్‌ (భారత్‌)పై సంచలన విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో శ్రావ్య శివాని 1–6, 0–6తో సహజ యమలపల్లి చేతిలో ఓడింది. డబుల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో రష్మిక–సాత్విక 7–6 (7/4), 6–2తో శ్రావ్య శివాని–షర్మదాలపై... నిధి చిలుముల–సౌమ్య 6–3, 6–1తో సుదీప్త–రియాలపై నెగ్గి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement