
Photo Courtesy: BCCI
భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా వారం రోజులు వాయిదా పడిన ఐపీఎల్ 2025 రేపటి నుండి (మే 17) పునఃప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో (రీస్టార్ట్‌లో) కేకేఆర్, ఆర్సీబీ బెంగళూరు వేదికగా తలపడనున్నాయి. రీవైజ్డ్ షెడ్యూల్ ప్రకారం జూన్ 3న జరిగే ఫైనల్‌తో ఈ సీజన్ ముస్తుంది. మే 27 వరకు లీగ్ మ్యాచ్‌లు జరుగనుండగా.. మే 29 (క్వాలిఫయర్ 1), మే 30 (ఎలిమినేటర్), జూన్ 1 (క్వాలిఫయర్ 2) తేదీల్లో ప్లే ఆఫ్స్ జరుగుతాయి.
ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు ముందు మరో 13 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో అధికారంగా ఏడు జట్లు ఉండగా.. చెన్నై, రాజస్థాన్, ఎస్‌ఆర్‌హెచ్ నిష్క్రమించాయి. ప్లే ఆఫ్స్ రేసులో పేరుకు ఏడు జట్లు ఉన్నప్పటికీ ప్రధానమైన పోటీ మాత్రం ఐదు జట్ల మధ్యే ఉంది. వీటిలోనూ రెండు బెర్త్‌లను ప్రస్తుతం టేబుల్ టాపర్లుగా ఉన్న గుజరాత్, ఆర్సీబీ (11 మ్యాచ్‌ల్లో తలో 8 విజయాలతో 16 పాయింట్లు) దాదాపు ఖరారు చేసుకున్నాయి.
ఈ రెండు జట్లు మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో వారి ప్లే ఆఫ్స్ అవకాశాలు నల్లేరుపై నడకే అని చెప్పాలి. గుజరాత్, ఆర్సీబీ మూడింటిలో తలో మ్యాచ్ గెలిచినా కనీసం మూడు, నాలుగు స్థానాల్లోనైనా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.
ఇక మిగిలింది రెండు బెర్త్‌లు. ఈ రెండు బెర్త్‌ల కోసం మూడు జట్ల మధ్య పోటీ ఉంది. రేసులో పంజాబ్ కింగ్స్‌కు (11 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లు) అవకాశాలు ఎక్కువగా ఉండగా.. ఢిల్లీ, ముంబైకి ఆతర్వాతి అవకాశాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ముంబైతో పోలిస్తే ఢిల్లీకే కాస్త ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 13 పాయింట్లు కలిగి ఉండగా.. ముంబై 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఐదు జట్లలో ముంబై మినహా మిగతా నాలుగు జట్లు ఇంకా తలో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
ప్లే ఆఫ్స్ రేసులో ప్రధానంగా ఉన్న జట్లు ఆడాల్సి మ్యాచ్‌లు ఇవే..
గుజరాత్
మే 18న ఢిల్లీతో (రాత్రి, ఢిల్లీ)
మే 22న లక్నోతో (అహ్మదాబాద్)
మే 25న సీఎస్‌కేతో (మధ్యాహ్నం, అహ్మదాబాద్)
ఆర్సీబీ
మే 17న కేకేఆర్‌తో (బెంగళూరు)
మే 23- సన్‌రైజర్స్‌తో (బెంగళూరు)
మే 27- లక్నోతో (లక్నో)
పంజాబ్
మే 18న రాజస్థాన్‌తో (మధ్యాహ్నం, జైపూర్)
మే 24న ఢిల్లీతో (జైపూర్)
మే 26న ముంబై ఇండియన్స్‌తో (జైపూర్)
ముంబై ఇండియన్స్
మే 21న ఢిల్లీతో (ముంబై)
మే 26న పంజాబ్‌తో (జైపూర్)
ఢిల్లీ
మే 18న గుజరాత్‌తో (రాత్రి, ఢిల్లీ)
మే 21న ముంబై ఇండియన్స్‌తో (ముంబై)
మే 24న పంజాబ్‌తో (జైపూర్)