IPL 2023: లేటు వయసులో ఇరగదీస్తున్న భారత ఆటగాళ్లు.. ముఖ్యంగా నలుగురు 'శర్మ'లు

IPL 2023: Veteran Indian Bowlers Performing Beyond Expectations - Sakshi

ఐపీఎల్‌-2023లో భారత వెటరన్‌ ఆటగాళ్లు కుర్రాళ్లతో పోటీపడి మరీ సత్తా చాటుతున్నారు. లేటు వయసులో వీరు అదిరిపోయే ప్రదర్శనలతో ఇరగదీస్తున్నారు. ముఖ్యంగా వయసు పైబడిన రిత్యా సరైన అవకాశాలు లేక చాలాకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. వీరి పెర్ఫార్మెన్స్‌కు ఫ్యాన్స్‌కు ముగ్దులవుతున్నారు.

అవకాశాలు లేవన్న కసితో బౌలింగ్‌ చేస్తున్న ఈ వెటరన్లు తమ కెరీర్‌లు పీక్స్‌లో ఉం‍డగా చేయని అద్భుతాలు ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. ముఖ్యంగా నలుగరు 'శర్మ'లు తమతమ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. బౌలర్లతో పాటు భారత వెటరన్‌ బ్యాటర్లు సైతం సత్తా చాటుతున్నారు.

వీరు కూడా జాతీయ జట్టుకు ఆడే అవకాశాలు లేవన్న కసితోనే తమలోని అత్యుత్తమ ప్రదర్శనను వెలికి తీస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో ప్రదర్శన కారణంగానే రహానే ఏకం‍గా జాతీయ జట్టును నుంచి పిలుపునందుకుని జాక్‌పాట్‌ కొట్టేశాడు. వీరు ఈ సీజన్‌లో మన్ముందు మరెన్ని అద్భుతాలు చేస్తారో వేచి చూడాలి. 

ఐపీఎల్‌-2023లో రఫ్ఫాడిస్తున్న భారత వెటరన్‌ బౌలర్లు..  

  • ఇషాంత్‌ శర్మ (ఢిల్లీ, 4 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు) 34 yrs
  • కర్ణ్‌ శర్మ (ఆర్సీబీ, 4 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు) 35 yrs
  • మోహిత్‌ శర్మ (గుజరాత్‌, 6 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు) 34 yrs
  • సందీప్‌ శర్మ (రాజస్థాన్‌, 7 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు) 30 yrs
  • అమిత్‌ మిశ్రా (లక్నో, 6 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు) 40 yrs
  • పియూశ్‌ చావ్లా (ముంబై, 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు) 34 yrs
  • అశ్విన్‌ (రాజస్థాన్‌, 9 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు) 36 yrs

ఐపీఎల్‌-2023లో రెచ్చిపోతున్న భారత వెటరన్‌ బ్యాటర్లు..  

  • శిఖర్‌ ధవన్‌ (పంజాబ్‌, 6 మ్యాచ్‌ల్లో 148.86 స్ట్రయిక్‌ రేట్‌తో 65.50 సగటున 262 పరుగులు) 37 yrs 
  • అజింక్య రహానే (చెన్నై, 7 మ్యాచ్‌ల్లో 189.83 స్ట్రయిక్‌ రేట్‌తో 44.80 సగటున 224 పరుగులు) 34 yrs
Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top