Sakshi News home page

IPL 2023 LSG Vs MI : ఉత్కంఠ పోరులో లక్నో సంచలన విజయం.. ప్లేఆఫ్‌కు మరింత దగ్గర

Published Tue, May 16 2023 7:13 PM

IPL 2023: LSG Vs Mumbai Indians Match Live Updates-Highlights - Sakshi

ఉత్కంఠ పోరులో లక్నో సంచలన విజయం.. ప్లేఆఫ్‌ ఆశలు సజీవం
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ ఐదు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. 178 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ 59, టిమ్‌ డేవిడ్‌ 19 బంతుల్లో 32 నాటౌట్‌ రాణించారు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయి, యష్‌ ఠాకూర్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. మోసిన్‌ ఖాన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. ఈ విజయంతో లక్నో సూపర్‌జెయింట్స్‌ ప్లేఆఫ్‌కు మరింత దగ్గరైంది.

సూర్య క్లీన్‌బౌల్డ్‌.. ముంబై ఇండియన్స్‌ 125/3
యష్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో స్కూప్‌షాట్‌ ఆడబోయి సూర్యకుమార్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ 15 ఓవరల్లో మూడు వికెట్లు నష్టపోయి 125 పరుగులు చేసింది. నెహాల్‌ వదేరా 12, టిమ్‌ డేవిడ్‌ ఆరు పరుగులతో ఆడుతున్నారు.

రోహిత్‌ శర్మ(37) ఔట్‌.. తొలి వికెట్‌ కోల్పోయిన ముంబై
37 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ రవి బిష్ణోయి బౌలింగ్‌లో దీపక్‌ హుడాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబై 92 పరుగుల వద్ద తొలి వికెట్‌ నష్టపోయింది. ఇషాన్‌ కిషన్‌ 53 పరుగులతో ఆడుతున్నాడు.

టార్గెట్‌ 178.. ముంబై ఇండియన్స్‌ 6 ఓవర్లలో 58/0
178 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ ఆరు ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ 29, రోహిత్‌ శర్మ 26 పరుగులతో ఆడుతున్నారు.

స్టోయినిస్‌ సంచలన ఇన్నింగ్స్‌.. ముంబై టార్గెట్‌ 178
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. మార్కస్‌ స్టోయినిస్‌ (47 బంతుల్లో 89 నాటౌట్‌, 4 ఫోర్లు, 8 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌ ఆడగా.. కృనాల్‌ పాండ్యా 49 పరుగులు చేసి రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో కృనాల్‌, స్టోయినిస్‌లు కలిసి నాలుగో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. ముంబై బౌల‍ర్లలో బెహండార్ఫ్‌ రెండు వికెట్లు తీయగా.. పియూష్‌ చావ్లా ఒక వికెట్‌ తీశాడు.

స్టోయినిస్‌ ఫిఫ్టీ.. లక్నో 162/3
మార్కస్‌ స్టోయినిస్‌ ఫిఫ్టీతో మెరవడంతో లక్నో 19 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌ జెయింట్స్‌ మూడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అంతకముందు కెప్టెన్‌ కృనాల్‌ పాండ్యా 49 పరుగుల వద్ద రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.

14 ఓవర్లలో లక్నో100/3
14 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌ జెయింట్స్‌ మూడు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. కృనాల్‌ పాండ్యా 44, మార్కస్‌ స్టోయినిస్‌ 32 పరుగులతో ఆడుతున్నారు.

9 ఓవర్లలో లక్నో 63/3
9 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌ జెయింట్స్‌ మూడు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. కృనాల్‌ పాండ్యా 23, మార్కస్‌ స్టోయినిస్‌ 17 పరుగులతో ఆడుతున్నారు.

తడబడిన లక్నో.. 6 ఓవర్లలో 35/2
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ తడబడుతోంది. 4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 23 పరుగులు చేసింది. డికాక్‌ 16, కృనాల్‌ పాండ్యా 13 పరుగుఉలతో ఆడుతున్నారు.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా మంగళవారం లక్నో వేదికగా 63వ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌, ముంబై ఇండియన్స్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది.

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్‌ కీపర్‌), దీపక్ హుడా, ప్రేరక్ మన్కడ్, కృనాల్ పాండ్యా(కెప్టెన్‌), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, స్వప్నిల్ సింగ్, మొహ్సిన్ ఖాన్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్‌), ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండార్ఫ్, ఆకాష్ మధ్వల్

ఈ మ్యాచ్‌ ఇరుజట్లకు కీలకంగా మారింది. గెలిచిన జట్టు ప్లేఆఫ్‌కు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. ఇరుజట్లు గతంలో రెండుసార్లు తలపడగా లక్నోనే విజయం వరించింది. 

Advertisement

What’s your opinion

Advertisement