IPL 2023: ఐపీఎల్‌ కోసం గుజరాత్‌ టైటాన్స్‌ మాస్టర్‌ ప్లాన్‌.. ఇప్పటి నుంచే?

IPL 2023: Defending champions Gujarat TITANS start TRAINING - Sakshi

ఐపీఎల్‌-2023 కోసం ఇప్పటి నుంచే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది. ఆదివారం (ఫిబ్రవరి 5) పలువురు గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు తమ హోం గ్రౌండ్‌ నరేంద్ర మోడీ స్టేడియంలో సమావేశమయ్యారు. గుజరాత్ కెప్టెన్‌ హార్దిక్ పాండ్యాతో పాటు శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ వంటి స్టార్‌ ఆటగాళ్లు ఆసీస్‌తో వన్డే సిరీస్‌ అనంతరం తమ జట్టుతో కలవనున్నారు.

                                               

ఇక ప్రస్తుతం ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొన్న ఆటగాళ్లలో రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, మోహిత్ శర్మ, వంటి వారు ఉన్నారు. వీరిందరూ గుజరాత్‌ హెడ్‌కోచ్‌ ఆశిష్ నెహ్రా నేతృత్వంలో సాధన చేస్తున్నారు. ముఖ్యంగా యువ ఆటగాళ్లను సిద్దం చేసే పనిలో నెహ్రా బీజీబీజీగా ఉన్నాడు.

గతేడాది సీజన్‌లో మనోహర్, సాయి సుదర్శన్ వంటి యువ ఆటగాళ్లు అదరగొట్టిన సంగతి తెసిందే. ఈ ఏడాది సీజన్‌లో కూడా తమ జట్టు అద్భుతంగా రాణించేలా నెహ్రా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా అరేంట్ర సీజన్‌లోనే హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని గుజరాత్‌ టైటాన్స్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.

                                            

శివమ్‌ మావికి భారీ ధర.. 
ఐపీఎల్‌-2023 మినీవేలంలో భారత యువ పేసర్‌ శివమ్‌ మావిని రూ. 6కోట్ల భారీ ధరకు గుజరాత్‌ కొనుగోలు చేసింది. అదే విధంగా ఐర్లాండ్‌ స్టార్‌ పేసర్‌ జాషువా లిటిల్‌ను రూ.4.4 కోట్లు వెచ్చించి టైటాన్స్‌ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను కూడా రూ.2 కోట్లకు గుజరాత్‌ దక్కించుకుంది.

ఐపీఎల్‌-2023కు గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు..
హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), శుభమాన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్ , దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ ,జాషువా లిటిల్, ఉర్విల్ పటేల్, శివమ్ మావి, కెఎస్‌ భరత్, ఓడియన్ స్మిత్, కేన్ విలియమ్సన్
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. ఆంధ్ర ఆటగాడు అరంగేట్రం! కిషన్‌కు నో ఛాన్స్‌

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top