IPL 2023, RR Vs PBKS: Ravichandran Ashwin Gives Mankad Warning To Shikhar Dhawan, Video Viral - Sakshi
Sakshi News home page

Dhawan-Ashwin: ధావన్‌కు అశ్విన్‌ వార్నింగ్‌.. వీడియో వైరల్‌

Apr 5 2023 9:22 PM | Updated on Apr 6 2023 10:49 AM

IPL 2023: Ashwin-Warning Shikar Dhawan Try-Mankading PBKS VS RR Viral - Sakshi

Photo: Jio Cinema Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పంజాబ్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ను రాజస్తాన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ హెచ్చరించాడు. ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్లో నాలుగో బంతిని విడవడానికి ముందే ధావన్‌ క్రీజు దాటాడు. ఇది గమనించిన అశ్విన్‌ బంతిని వేయడం ఆపేసి మన్కడింగ్‌ చేయడానికి ప్రయత్నించాడు.


Photo: Jio Cinema Twitter

కానీ బంతిని బెయిల్స్‌కు తగిలించకుండా ధావన్‌కు వార్నింగ్‌తోనే సరిపెట్టాడు. ఆ సమయంలో ధావన్‌ పూర్తిగా క్రీజు బయట ఉన్నాడు. కానీ అశ్విన్‌ క్రీడాస్పూర్తిని ప్రదర్శించాడు. అయితే వెంటనే వెనక్కి వచ్చిన ధావన్‌ అశ్విన్‌ను చూస్తూ చేసేయాల్సింది అన్న తరహాలో చిన్న స్మైల్‌ ఇచ్చాడు.  ఇదే సమయంలో కెమెరా జాస్‌ బట్లర్‌వైపు తిరగడం ఆసక్తి కలిగించింది.  దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కెమెరా బట్లర్‌వైపు ఎందుకు తిరిగిందో కూడా మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇదే ఐపీఎల్‌లో అశ్విన్‌ పంజాబ్‌కు ఆడుతున్న సమయంలో బట్లర్‌ను మన్కడింగ్‌ చేసి పెవిలియన్‌ చేర్చాడు. ఒకరకంగా అశ్విన్‌ మన్కడింగ్‌ను మరోసారి తెరపైకి తెచ్చిన క్రికెటర్‌గా నిలిచాడు. అయితే అశ్విన్‌ చర్యను కొందరు తప్పుబడితే మరికొందరు సమర్థించారు. కొన్నాళ్ల పాటు మన్కడింగ్‌పై చర్చ జరిగింది. అయితే ఇటీవలే మన్కడింగ్‌ను రనౌట్‌గా మారుస్తూ ఐసీసీ చట్టబద్దం చేసింది.

చదవండి: ధావన్‌ దెబ్బకు రాజపక్స రిటైర్డ్‌హర్ట్‌.. ఐపీఎల్‌కు దూరమయ్యే చాన్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement