SRH Vs RCB: కోహ్లి గోల్డెన్‌ డక్‌.. జగదీశ సుచిత్‌ అరుదైన రికార్డు!

IPL 2022 SRH Vs RCB Jagadeesha Suchith Record Virat Kohli Golden Duck - Sakshi

ఐపీఎల్‌-2022లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్‌ జగదీశ సుచిత్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు.  ఆర్సీబీ ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఓపెనర్‌ విరాట్‌ కోహ్లిని అవుట్‌ చేశాడు. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో స్పిన్నర్‌గా నిలిచాడు.

అంతకుముందు 2009లో కెవిన్‌ పీటర్సన్‌, 2012లో మార్లన్‌ సామ్యూల్స్‌ ఈ ఫీట్‌ నమోదు చేశారు. కాగా శ్రేయస్‌ గోపాల్‌ స్థానంలో సన్‌రైజర్స్‌ తుది జట్టులోకి వచ్చాడు కర్ణాటక బౌలర్‌ సుచిత్‌. ఈ మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు ఓవర్లు బౌల్‌ చేసిన సుచిత్‌.. 30 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఆరంభంలోనే కోహ్లి.. జట్టుకు అవసరమైన సమయంలో రజత్‌ పాటిదార్‌ను అవుట్‌ చేశాడు.

ఇక ఆర్సీబీ కెప్టెన్‌ ఫాప్‌ డుప్లెసిస్‌(73- నాటౌట్‌), రజత్‌ పాటిదార్‌(48), గ్లెన్‌ మాక్స్‌వెల్‌(33).. దినేశ్‌ కార్తిక్‌(8 బంతుల్లో 30) అద్భుతంగా రాణించారు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రైజర్స్‌కు 193 పరుగుల లక్ష్యాన్ని విధించింది.

చదవండి👉🏾Shimron Hetmyer: కీలక సమయంలో స్వదేశానికి రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఆటగాడు?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top