SRH Vs Gujarat Titans: టాప్‌కు గురిపెట్టిన ఎస్‌ఆర్‌హెచ్‌.. ప్రతీకారం తీర్చుకునే పనిలో గుజరాత్‌ టైటాన్స్‌

IPL 2022: SRH Vs Gujarat Titans Match Prediction - Sakshi

ఐపీఎల్‌ 2022లో భాగంగా బుధవారం గుజరాత్‌ టైటాన్స్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. గుజరాత్‌ టైటాన్స్‌ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు గెలిచి.. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే పరాజయం పాలై పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్‌ ఆరంభంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికి.. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు.. రెండు ఓటములతో ఎస్‌ఆర్‌హెచ్‌ మూడో స్థానంలో ఉంది.

ఈ ఇద్దరి మధ్య జరగనున్న మ్యాచ్‌లో గెలిచిన జట్టు టాప్‌ స్థానానికి దూసుకెళుతుంది. అయితే ఎస్‌ఆర్‌హెచ్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌ గెలవడం ద్వారా ఈ సీజన్‌లో విజయాల బాట పట్టింది. ఆ మ్యాచ్‌లో కేన్‌ విలియమ్సన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరి ఇరుజట్ల మధ్య జరగనున్న రెండో మ్యాచ్‌లో హార్దిక్‌ సేన ప్రతీకారం తీర్చుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. 

ఇక బలబలాల విషయానికి వస్తే.. ముందుగా ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌లో అభిషేక్‌ శర్మ, కేన్‌ విలియమ్సన్‌, రాహుల్‌ త్రిపాఠి, ఎయిడెన్‌ మార్ర్కమ్‌, నికోలస్‌ పూరన్‌లతో పటిష్టంగా కనిపిస్తోంది. ఒకరు విఫలమైనా మిగతావాళ్లు బ్యాటింగ్‌ చేస్తూ జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌కు అతిపెద్ద బలం బౌలింగ్‌ లైనఫ్‌. భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లతో పేస్‌ దళం పటిష్టంగా కనిపిస్తుండగా.. సుందర్‌ లేని లోటును జగదీష్‌ సుచిత్ తీరుస్తున్నాడు.

మరోవైపు గుజరాత్‌ టైటాన్స్‌కు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా పెద్ద బలం అని చెప్పొచ్చు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న అతనికి తోడుగా డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాటియాలు మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికి.. ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. ఇక లోయర్‌ ఆర్డర్‌లో అభినవ్‌ మనోహర్‌, రషీద్‌ ఖాన్‌, లోకీ ఫెర్గూసన్‌లు తమ పాత్రను పోషిస్తున్నారు. బౌలింగ్‌లో మహ్మద్‌ షమీ, యష్‌ దయాల్‌, అల్జారీ జోసెఫ్‌, ఫెర్గూసన్‌, రషీద్‌ ఖాన్‌లు ఉండనే ఉన్నారు.

గుజరాత్ టైటాన్స్ జట్టు అంచనా: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్‌), డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అంచనా : అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్ (వికెట్‌ కీపర్‌), శశాంక్ సింగ్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top