IPL 2022: 12 ఏళ్ల క్రితం ఇలాగే.. సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యేనా!

IPL 2022: Only 2nd Time After-2010 CSK Lost 4-Consecutive Matches - Sakshi

ఐపీఎల్‌ 2022లో సీఎస్‌కే వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. శనివారం ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన సీఎస్‌కే వరుసగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. మొదట బ్యాటింగ్‌లోనూ పెద్దగా మెరవని సీఎస్‌కే.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ జోరు చూపించలేకపోయింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లు సీఎస్‌కే బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని సీజన్‌లో తొలి విజయాన్ని దక్కించుకుంది.

అసలు ఆడుతుంది డిపెండింగ్‌ చాంపియనేనా కాదా అనేలా సీఎస్‌కే ఆటతీరు రోజురోజుకు మరింత దిగజారుతుంది. గతంలో సీఎస్‌కే 150పై చిలుకు స్కోర్లు చేసిన సందర్భాల్లో  చాలా తక్కువగా ఓడింది. ఈ నేపథ్యంలోనే సీఎస్‌కే ఒక చెత్త రికార్డును నమోదు చేసింది. ఒక సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడం సీఎస్‌కేకే ఇది రెండోసారి. ఇంతకముందు 2010లో సీఎస్‌కే ఇలాగే వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడింది. కానీ విచిత్రమేంటంటే.. ఆ తర్వాత వరుస విజయాలు సాధించిన సీఎస్‌కే ఏకంగా టైటిల్‌ విజేతగా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది.

అప్పటికి ధోని టీమిండియా కెప్టెన్‌గా ఉండడం.. సీఎస్‌కేను తన మైండ్‌గేమ్‌తో నడిపించి తొలిసారి టైటిల్‌ అందించాడు. అయితే తాజా పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేవు. ధోని కెప్టెన్‌గా లేడు.. జడేజా నాయకత్వం వహిస్తన్నా అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అయితే 12 ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితుల్లోనే తేరుకున్న సీఎస్‌కే చాంపియన్‌గా అవతరించింది. అదే సీన్‌ రిపీట్‌ అవుతుందా అనేది అనుమానంగానే ఉన్నప్పటికి.. ధోని లాంటి పెద్దన్న అండ ఉన్నప్పుడు కాస్త ఆశలు ఉండడం సహజమే. సీఎస్‌కే తర్వాతి మ్యాచ్‌ల్లో వరుసగా విజయాలు సాధిస్తుందేమో వేచి చూద్దాం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top