
ఎంఎస్ ధోని సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్న సంగతి అందరికి తెలిసిందే. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని ఆ బాధ్యతలను తన శిష్యుడు రవీంద్ర జడేజాకు అప్పగించినట్లు సీఎస్‌కే గురువారం తన ట్విటర్‌లో ప్రకటించింది. కాగా సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతలపై రవీంద్ర జడేజా స్పందించాడు.
''చాలా సంతోషంగా ఉంది.. అదే సమయంలో నాపై పెద్ద బాధ్యత పడింది. మహీ భయ్యా సీఎస్‌కేకు ఐపీఎల్‌లో పెద్ద లీగసిని ఏర్పరిచాడు. కెప్టెన్‌గా దానిని నేను విజయవంతగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ దీని గురించి నేను అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ధోని భయ్యా కెప్టెన్ మాత్రమే తప్పుకున్నాడు. ఆటగాడిగా జట్టులో ఉంటాడు. జట్టులో పెద్దన్న పాత్ర పోషించే ధోని సలహాలను నేను ఉపయోగించుకుంటా. మీ ప్రేమకు, అభిమానికి కృతజ్ఞతలు. మీ మద్దతు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా'' అంటూ పేర్కొన్నాడు. జడేజా వ్యాఖ్యలను వీడియో రూపంలో ట్విటర్‌లో షేర్ చేసిన సీఎస్‌కే.. ''మా కొత్త కెప్టెన్ ఫస్ట్ రియాక్షన్ ఇదేనంటూ'' క్యాప్షన్ జత చేసింది.
ఇక ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడనే విషయం తెలుసుకున్న సీఎస్‌కే ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని ఊహాగానాలు వస్తున్న వేళ.. ధోని తన ఐపీఎల్ కెరీర్‌ను కెప్టెన్‌గానే ముగిస్తే బాగుండేదని చాలా మంది కామెంట్ చేశారు.ఇక ఆరంభం నుంచి సీఎస్‌కేకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. నాలుగుసార్లు జట్టును చాంపియన్‌గా నిలపడంతో పాటు ఒక జట్టును ఎక్కువసార్లు ఫైనల్స్, ప్లే ఆఫ్ వరకు తీసుకెళ్లిన కెప్టెన్‌గా ధోని నిలిచాడు. 2010, 2011, 2018, 2021 సీజన్లలో ధోని సారధ్యంలో సీఎస్‌కే నాలుగుసార్లు టైటిల్ గెలిచింది. మార్చి 26న కేకేఆర్, సీఎస్‌కే మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్‌కు తెరలేవనుంది.
చదవండి: MS Dhoni: ధోని ఎందుకీ నిర్ణయం.. కెప్టెన్‌గా ముగిస్తే బాగుండేది!
IPL 2022: ధోని సంచలన నిర్ణయం.. సీఎస్‌కే కెప్టెన్సీకి గుడ్ బై.. కొత్త సారథి ఎవరంటే!
📹 First reactions from the Man himself!#ThalaivanIrukindran 🦁💛 @imjadeja pic.twitter.com/OqPVIN3utS
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2022