IPL 2022 | Chennai Super Kings vs Punjab Kings : Head to Head Records - Sakshi
Sakshi News home page

CSK VS Punjab Kings: హెడ్‌ టు హెడ్‌ రికార్డ్స్‌ ఎలా ఉన్నాయంటే..?

Apr 3 2022 5:04 PM | Updated on Apr 3 2022 6:02 PM

IPL 2022 CSK VS Punjab Kings: Head To Head Records - Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్‌ 3) మ‌రో ఆస‌క్తిర పోరు జరుగనుంది. డిఫెండింగ్ ఛాంపియ‌న్‌ చెన్నై సూప‌ర్ కింగ్స్‌, పంజాబ్ కింగ్స్ జ‌ట్ల మధ్య జరుగనున్న ఈ మ్యాచ్‌ ముంబైలోని బ్ర‌బోర్న్ స్టేడియంలో రాత్రి 7:30 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. లీగ్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు చెరో 2 మ్యాచ్‌లు ఆడగా, పంజాబ్‌ ఓ గెలుపు (ఆర్సీబీపై 5 వికెట్ల తేడాతో విజయం), మరో మ్యాచ్‌లో పరాజయం (కేకేఆర్‌ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి) మూటగట్టుకోగా.. సీఎస్‌కే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ (కేకేఆర్‌ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి, లక్నో చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం) ఓటమిపాలై బోణీ విజయం కోసం తహతహలాడుతుంది. 

గత రికార్డులను పరిశీలిస్తే.. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్ప‌టివ‌ర‌కు 25 సార్లు త‌ల‌ప‌డగా, చెన్నై15, పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేశాయి. ఈ ఇరు జట్లు చివరిగా తలపడిన 5 సందర్భాల్లో చెన్నై 4 మ్యాచ్‌ల్లో గెల‌వ‌గా, పంజాబ్ ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచింది. గ‌తేడాది ఐపీఎల్‌ విషయానికొస్తే.. చెన్నై, పంజాబ్‌ జట్లు చెరో మ్యాచ్‌లో గెలుపొందాయి. ఓవరాల్‌గా చూస్తే.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో పంజాబ్‌పై చెన్నైదే పైచేయిగా తెలుస్తోంది. ఇక తుది జట్లలో మార్పులు చేర్పుల విషయాన్ని పరిశీలిస్తే.. ఇరు జట్లు గత మ్యాచ్‌లో ఆడిన జట్లనే యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. 

తుది జట్లు (అంచనా):

చెన్నైసూప‌ర్ కింగ్స్‌: రాబిన్ ఊత‌ప్ప‌, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, శివ‌మ్ దూబే, అంబ‌టి రాయుడు, ర‌వీంద్ర జ‌డేజా (కెప్టెన్), మ‌హేంద్ర సింగ్ ధోని (వికెట్ కీప‌ర్), డ్వేన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, తుషార్ దేశ్‌ పాండే, రాజవర్ధన్ హంగర్గేకర్‌.

పంజాబ్ కింగ్స్‌: మ‌యాంక్ అగ‌ర్వాల్, శిఖ‌ర్ ధావ‌న్, బెయిర్‌స్టో, భానుక రాజ‌ప‌క్స, రాజ్ బవా, షారూక్ ఖాన్‌, హర్‌ప్రీత్ బ్రార్, ఓడియ‌న్ స్మిత్, రాహుల్ చాహ‌ర్, క‌గిసో రబాడ‌, అర్ష్‌దీప్ సింగ్.
చదవండి: IPL 2022: బరిలోకి దిగనున్న దీపక్‌ చాహర్‌.. ఎప్పటి నుంచి అంటే..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement