IPL 2022 Auction: ఏయే జట్లు ఎవరిని రిటైన్‌ చేసుకుంటున్నాయి? ఎంత మొత్తం ఖర్చు చేయాలి? పూర్తి వివరాలు!

IPL 2022 Auction: KKR RCB SRH RR All 8 Teams Probable Retentions - Sakshi

IPL 2022 Auction: KKR RCB SRH RR All 8 Teams Probable Retentions: ఐపీఎల్‌-2022 మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంఛైజీలు తాము రిటైన్‌ చేసుకునే ఆటగాళ్ల లిస్టును సమర్పించే సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఇప్పటికే 8 జట్లు తుది జాబితాను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎవరెవరిని రిటైన్‌ చేసుకోవాలి? ఎవరిని వదులుకోవాలి? అన్న విషయాలపై ఇప్పటికే నిర్ణయానికి వచ్చిన ఫ్రాంఛైజీలు.. మెగా వేలానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిటెన్షన్‌ రూల్స్‌, ఏయే జట్లు ఎవరిని రీటైన్‌ చేసుకుంటున్నాయి, అందుకోసం ఎంత మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది అన్న అంశాలను పరిశీలిద్దాం.

ఐపీఎల్‌ 2022 మెగా వేలం- రిటెన్షన్‌ నిబంధనలు?
రిటెన్షన్‌ నిబంధనల ప్రకారం ఒక ఫ్రాంఛైజీ గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఇందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు కూడా ఉండవచ్చు. వీళ్ల కోసం సాలరీ పర్స్‌లో 90 కోట్ల నుంచి.. ఫ్రాంఛైజీ 42 కోట్ల రూపాయలు ఖర్చు చేయవచ్చు. రిటైన్‌ జాబితాలో ఉన్న మొదటి ఆటగాడి కోసం 16 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు: చెన్నై సూపర్‌కింగ్స్‌ తమ మొదటి పిక్‌గా రవీంద్ర జడేజాను ఎంచుకుందన్న వార్తల నేపథ్యంలో అతడి కోసం పర్సు నుంచి 16 కోట్లు పక్కన పెట్టాల్సి ఉంటుంది.

రిటెన్షన్‌ విధానంలో నలుగురు ప్లేయర్ల కోసం వెచ్చించాల్సిన మొత్తం- 42 కోట్ల రూపాయలు.
మొదట రిటైన్‌ చేసుకున్న ఆటగాడి కోసం- రూ.16 కోట్లు
రెండో ప్లేయర్‌ కోసం- 12 కోట్లు
మూడో ప్లేయర్‌ కోసం- 8 కోట్లు
నాలుగో ప్లేయర్‌ కోసం- 6 కోట్లు

ముగ్గురు ప్లేయర్ల కోసం వెచ్చించాల్సిన మొత్తం- 33 కోట్ల రూపాయలు
ప్లేయర్‌ 1- రూ. 15 కోట్లు
ప్లేయర్‌ 2- రూ. 11 కోట్లు
ప్లేయర్‌ 3- రూ. 7 కోట్లు

ఇద్దరు ప్లేయర్ల రిటెన్షన్‌ కోసం వెచ్చించాల్సిన మొత్తం- 24 కోట్ల రూపాయలు
ప్లేయర్‌ 1- రూ. 14 కోట్లు
ప్లేయర్‌ 2- రూ. 10 కోట్లు.

కేవలం ఒకే ఒక్క ఆటగాడిని రిటైన్‌ చేసుకునేందుకు వెచ్చించాల్సిన మొత్తం 14 కోట్ల రూపాయలు.

ఏయే జట్లు ఏ ఆటగాళ్లను రీటైన్‌ చేసుకుంటున్నాయంటే?

చెన్నై సూపర్‌కింగ్స్‌(సీఎస్‌కే)- రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోని, రుతురాజ్‌ గైక్వాడ్‌, మొయిన్‌ అలీ.
కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్‌)‌- సునిల్‌ నరైన్‌, ఆండ్రీ రసెల్‌, వరుణ్‌ చక్రవర్తి, వెంకటేశ్‌ అయ్యర్‌.
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌): కేన్‌ విలియమ్సన్‌
 

ముంబై ఇండియన్స్(ఎంఐ)‌- రోహిత్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా
రాయల్‌ చాలెంజన్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)- విరాట్‌ కోహ్లి, గ్లెన్‌ మాక్స్‌వెల్‌.
ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ)‌- రిషభ్‌ పంత్‌, పృథ్వీ షా, అక్షర్‌ పటేల్‌, అన్రిచ్‌ నోర్ట్జే.
రాజస్తాన్‌ రాయల్స్‌(ఆర్‌ఆర్‌)- సంజూ శాంసన్‌(14 కోట్లు వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం)

రిలీజ్‌ చేస్తున్న ఆటగాళ్ల జాబితా!

కేకేఆర్‌- ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, పాట్‌ కమిన్స్‌.
ఎస్‌ఆర్‌హెచ్‌- కేన్‌ విలియమ్సన్‌ రిటెన్షన్‌ మినహా ఏ ఆటగాడి గురించి ఇంకా తుది నిర్ణయానికి రాలేదు.
ఢిల్లీ క్యాపిటల్స్‌- శిఖర్‌ ధావన్‌, అశ్విన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కగిసో రబడ
రాజస్తాన్‌ రాయల్స్‌- బెన్‌ స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌, కార్తిక్‌ త్యాగి, రాహుల్‌ తెవాటియా
పంజాబ్‌ కింగ్స్‌- ఏ ఆటగాడిని కూడా రిటైన్‌ చేసుకోవడం లేదని సమాచారం.

చదవండి: IPL 2022 Mega Auction:‘బంపర్‌ అనౌన్స్‌మెంట్‌’.. ఇదే చివరి మెగా వేలం.. ఇక ముందు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top