'సామ్‌ ఇంటికెళ్లి బాగా చదువుకో'.. రైనా ట్రోల్‌

IPL 2021: Suresh Raina And Sam Curran Hillarious Meme Becomes Viral - Sakshi

చెన్నై: సోషల్‌ మీడియా అంటేనే ట్రోల్స్‌, మీమ్స్‌కు పెట్టింది పేరు. అప్పుడప్పుడు సాధారణ వ్యక్తులు ట్రోల్‌ చేస్తూ పెట్టే కామెంట్స్‌ వైరల్‌ అవుతుంటాయి. అలాంటిది సెలబ్రిటీలు పెడితే ఇక చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ సందర్భంగా సీఎస్‌కే ఆటగాళ్లు సురేశ్‌ రైనా, సామ్‌ కరన్‌ల మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణ ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. వాస్తవానికి వారిద్దరు మాట్లాడుకున్న సందర్భం వేరుగా ఉన్నా.. ఫోటోలో సామ్‌ కరన్‌ చిన్నపిల్లాడి ఫోజు వైరల్‌గా మారింది. 

''సామ్‌.. లీగ్‌ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లి బాగా చదువుకో.. జనరల్‌ నాలెడ్జ్‌ ఇంకా పెంచుకో అన్నట్లు'' రైనా ట్రోల్‌ చేసినట్లుగా చూపించారు. దానికి సామ్‌ కరన్‌ సరేనన్నట్లు తల ఊపుతున్నట్లుగా అనిపించింది. దీనిపై రైనా తన ట్విటర్‌లో స్పందిస్తూ.. సూపర్‌ అంటూ లాఫింగ్‌ ఎమోజీతో పాటు లాఫింగ్‌ సింబల్‌ను ట్యాగ్‌ చేశాడు.  ఇక సీఎస్‌కే గతేడాది ఐపీఎల్‌ సీజన్‌ను మరిపిస్తూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక గతేడాది ఐపీఎల్‌ సీజన్‌కు దూరంగా ఉన్న రైనా ఐపీఎల్‌ 14వ సీజన్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లాడిన రైనా 6 ఇన్నింగ్స్‌లు కలిపి 126 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్‌ సెంచరీ కూడా ఉంది. సామ్‌ కరన్‌ ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లాడి 9 వికెట్లు తీశాడు. ఇక కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ రద్దు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: ఐపీఎల్‌ ఆపేసి మంచి పని చేశారు: రోహిత్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top