Kavya Maran: ‘మిస్టరీ గర్ల్‌’ మళ్లీ వచ్చింది | IPL 2021: Sunrisers Hyderabad Mystery Girl Steals Show In Chennai | Sakshi
Sakshi News home page

Kavya Maran: ‘మిస్టరీ గర్ల్‌’ మళ్లీ వచ్చింది

Apr 12 2021 2:44 PM | Updated on Apr 12 2021 5:09 PM

IPL 2021: Sunrisers Hyderabad Mystery Girl Steals Show In Chennai - Sakshi

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జట్టు మిస్ట‌రీ గ‌ర్ల్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.

చెన్నై: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జట్టు మిస్ట‌రీ గ‌ర్ల్ మ‌ళ్లీ వ‌చ్చేసింది. నిన్న రాత్రి కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు వ‌చ్చిన తను స్టాండ్స్‌లో కూర్చొని సన్‌రైజర్స్‌ జట్టుని చీర్ చేసింది. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్‌ ? హైదరాబాద్‌ జట్టుకు సపోర్ట చేస్తున్న ఈ అమ్మడు పేరు కావ్య మార‌న్‌. త‌మిళ‌నాడు క‌ళానిధి మార‌న్ ఏకైక కూతురు. స‌న్ నెట్‌వ‌ర్క్ చానెల్స్ బిజినెస్‌లోనూ ఆమె చాలా యాక్టివ్‌గా ఉంది. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్ సీఈవో కూడా వ్యవహరిస్తోంది.

ఆమె తొలిసారి 2018 సీజ‌న్ ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మ్యాచ్‌లో కనిపించింది. ఇప్పడు కూడా కేకేఆర్‌తో తలపడుతున్న మ్యాచ్‌లోనే క‌నిపించ‌డం విశేషం. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెన‌ర్ గిల్‌ను ర‌షీద్ అవుట్ చేయ‌గానే కావ్య సెల‌బ్రేట్ చేసుకుంటుండగా కెమెరా ఆమె వైపుకు తిప్పారు. అలా మళ్లీ తెరపైకి వచ్చింది.  ఆ మ‌ధ్య వేలంలో స‌న్‌రైజ‌ర్స్ టేబుల్ ద‌గ్గ‌ర క‌నిపించేసరకి ఆ అమ్మాయి పైకే కెమెరాలు అదే పనిగా జూమ్ చేశాయి. దీంతో ఎవరీ మిస్ట‌రీ గ‌ర్ల్ అంటూ అభిమానులు తెగ వెతికారు. ప్రస్తుతం కావ్య తన జట్టుని చీర్‌ చేస్తుండగా తీసిన వీడియో వైర‌ల్ అయింది.

( చదవండి: మూడుసార్లు గోల్డెన్‌ డక్‌‌.. మూడు సార్లు 80కి పైగా పరుగులు )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement