ముస్తాఫిజుర్ రెహ్మాన్ సూపర్‌ ఫీల్డింగ్‌.. వావ్ అంటున్న ఫ్యాన్స్ | IPL 2021: Mustafizur Rahman Outstanding Effort Saves SIX For Side | Sakshi
Sakshi News home page

RR Vs RCB: ముస్తాఫిజుర్ రెహ్మాన్ సూపర్‌ ఫీల్డింగ్‌.. వావ్ అంటున్న ఫ్యాన్స్

Sep 30 2021 2:08 PM | Updated on Sep 30 2021 2:10 PM

IPL 2021: Mustafizur Rahman Outstanding Effort Saves SIX For Side - Sakshi

Courtesy: IPL

Mustafizur Rahmans Outstanding  Effort Saves SIX For Side:  ఐపీఎల్‌-2021 సెకెండ్‌ ఫేజ్‌లో భాగంగా బుధవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఫాస్ట్‌బౌలర్‌  ముస్తాఫిజుర్ రెహ్మాన్   అద్భుత ఫీల్డింగ్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన కార్తీక్ త్యాగీ బౌలింగ్‌లో.. గ్లెన్ మాక్స్‌వెల్  బంతిని లాంగ్ లెగ్ దిశగా భారీ షాట్‌ ఆడడానికి ప్రయత్నించాడు. అయితే బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న  ముస్తాఫిజుర్ సరైన సమయంలో జంప్ చేసి ఆ బంతిని సిక్స్‌గా వెళ్లకుండా అడ్డుకున్నాడు.

దీంతో సిక్స్‌కు బదులుగా  సింగిల్‌ మాత్రమే వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ముస్తాఫిజుర్  సూపర్‌ ఫీల్డింగ్‌కునెటిజన్లు  ఫిదా అవుతున్నారు.  కాగా ​రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో  పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఓపెనర్లు ఎవిన్‌ లూయిస్‌(58), యశస్వి జైస్వాల్‌(31) శుభారంభం అందించినప్పటికీ.. మిడిలార్డర్‌ దారుణంగా విఫలమైంది.  తర్వాత 150 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి  దిగిన బెంగళూరు కేవలం మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

చదవండి: రాజస్తాన్‌ స్టార్‌ ఆటగాడిపై ఆ జట్టు కోచ్‌ కీలక వాఖ్యలు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement