రాజస్తాన్‌ సరికొత్త చరిత్ర.. సన్‌రైజర్స్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌ | Rajasthan Royals script all-time record for most sixes in an IPL season, surpass SRH | Sakshi
Sakshi News home page

IPL 2026: రాజస్తాన్‌ సరికొత్త చరిత్ర.. సన్‌రైజర్స్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌

May 30 2026 4:27 PM | Updated on May 30 2026 4:45 PM

Rajasthan Royals script all-time record for most sixes in an IPL season, surpass SRH

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ పోరాటం ముగిసిన సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-2లో ఓట‌మి పాలైన రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌.. మ‌రోసారి ఫైన‌ల్‌కు చేరకుండానే ఇంటిముఖం ప‌ట్టింది.

రియాన్ ప‌రాగ్ సార‌థ్యంలోని రాయ‌ల్స్ జ‌ట్టు బ్యాటింగ్ ప‌రంగా రాణించిన‌ప్ప‌టికి, బౌలింగ్‌లో మాత్రం దారుణంగా విఫ‌ల‌మైంది. 215 ప‌రుగుల ల‌క్ష్యాన్ని గుజ‌రాత్ కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఊదిప‌డేసింది. అయితే ఈమ్యాచ్‌లో రాజ‌స్తాన్ ఓట‌మిపాలైన‌ప్ప‌టికి ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.

ఒక ఐపీఎల్ సీజ‌న్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా రాజ‌స్తాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది సీజన్‌లో రాజస్తాన్ ఏకంగా 181 కొట్టింది. దీంతో 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నెలకొల్పిన 178 సిక్సర్ల రికార్డును రాజస్తాన్ బ్రేక్ చేసింది.

రాజస్తాన్‌ రాయల్స్ కొట్టిన మొత్తం 181 సిక్సర్లలో, కేవలం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఒక్కడే 72 సిక్సర్లు బాదడం విశేషం. ఈ క్రమంలోనే ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా   'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్ (59 సిక్సర్లు - 2012) రికార్డును బద్దలు కొట్టాడు.

వైభవ్ తర్వాత రాజస్తాన్ జట్టులో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరే
ధ్రువ్ జురెల్: 24 సిక్సర్లు

డొనవొన్‌ ఫెరీరా: 23 సిక్సర్లు

రియాన్ పరాగ్ (కెప్టెన్): 21 సిక్సర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement