పాపం సాయి సుదర్శన్‌.. క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి | Sai Sudharsan throws his bat onto the stumps, out hit-wicket in Qualifier 2 | Sakshi
Sakshi News home page

పాపం సాయి సుదర్శన్‌.. క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి

May 29 2026 11:19 PM | Updated on May 29 2026 11:19 PM

Sai Sudharsan throws his bat onto the stumps, out hit-wicket in Qualifier 2

ఐపీఎల్‌-2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయిసుదర్శన్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. ముల్లాన్‌పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో క్వాలిఫయర్‌-2లో సుద‌ర్శ‌న్ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. సుద‌ర్శ‌న్ ఇలా విచిత్రంగా ఔట‌వ్వడం ఇది వ‌రుస‌గా రెండో సారి కావ‌డం విశేషం. అంత‌కుముందు రాయ‌ల్స్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో కూడా సుద‌ర్శ‌న్ హిట్ వికెట్‌గా ఔట‌య్యాడు.

ఏమి జ‌రిగిందంటే?
ఈ క్వాలిఫ‌య‌ర్‌-2 మ్యాచ్‌లో సుద‌ర్శ‌న్ అద్భుత‌మైన హాఫ్ సెంచ‌రీ సాధించి మంచి రిథ‌మ్‌లో క‌న్పించాడు. అయితే గుజ‌రాత్ ఇన్నింగ్స్ 13 ఓవ‌ర్ వేసిన బ్రిజేష్ శ‌ర్మ.. ఐదో బంతిని సుద‌ర్శ‌న్‌కు ఫుట్‌టాస్‌గా సంధించాడు. ఆ బంతిని ఆఫ్‌సైడ్ డీప్‌స్క్వేర్ దిశ‌గా బౌండ‌రీకి త‌ర‌లించాడు. అయితే షాట్ ఆడే వేగంలో ఈసారి కూడా బ్యాట్ అతని చేతిలో నుంచి జారిపోయింది.

గత మ్యాచ్‌లో బ్యాట్ కిందపడి దొర్లుకుంటూ వికెట్లను తాకితే, ఈసారి మాత్రం నేరుగా వెళ్లి స్టంప్స్ మీద పడింది. దీంతో గ్రౌండ్ మొత్తం ఒక్క‌సారిగా సెలైంట్ అయిపోయింది. శుభ్‌మన్ గిల్ తల పట్టుకుని మోకాళ్లపై కూలబడిపోయాడు. 

లైవ్ కామెంటరీలో ఉన్న రవిశాస్త్రి తన మార్క్ స్టైల్‌లో... "ఎక్కడ ఉంది ఫెవికాల్? ఎక్కడ ఉంది?  వ్యాఖ్య‌నించాడు. బ‌హుశా క్రికెట్ చ‌రిత్ర‌లో ఓ ప్లేయ‌ర్ వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లో హిట్‌వికెట్ అవ్వ‌డం ఇదే తొలిసారి కావ‌చ్చు. సుద‌ర్శ‌న్ మొత్తంగా 32 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 58 పరుగులు చేశాడు.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement