తెలుగు క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురిపించిన మ్యాక్స్‌వెల్‌, కోహ్లి

IPL 2021: Maxwell Says KS Bharat Is Genuine Top Class Batter - Sakshi

Maxwell And Kohli Praises Srikar Bharat: తెలుగు క్రికెటర్‌, విశాఖ కుర్రాడు కోన శ్రీకర్‌ భరత్‌పై ఆర్సీబీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో ఆర్సీబీ వికెట్‌కీపర్‌గా రాణిస్తున్న భరత్‌.. నిన్న రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంయమనంతో బ్యాటింగ్‌ చేసి 35 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌ సాయంతో 44 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చిన తీరును మ్యాక్సీతో పాటు ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సైతం కొనియాడారు. భరత్‌ అసలు సిసలైన టాప్‌ క్లాస్‌ బ్యాటర్‌ అని వీరు కితాబునిచ్చారు. భరత్‌ బ్యాటింగ్‌లో చాలా వేరియేషన్స్‌ ఉన్నాయని, అవి పొట్టి క్రికెట్‌లో చాలా ఉపయోగకరమని పేర్కొన్నారు. 

భరత్‌.. బ్యాటర్‌గానే కాకుండా వికెట్‌కీపర్‌గా కూడా అద్భుతంగా రాణిస్తున్నాడని, భవిష్యత్తులో టీమిండియాలో కచ్చితంగా చోటు దక్కించుకుంటాడని అశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా, నిన్న ఆర్‌ఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో భరత్‌ సహా మ్యాక్స్‌వెల్‌(30 బంతుల్లో 50 నాటౌట్‌; 6 ఫోర్లు, సిక్స్‌), పడిక్కల్‌(17 బంతుల్లో 22; 4 ఫోర్లు), కోహ్లి(20 బంతుల్లో 25; 4 ఫోర్లు) రాణించడంతో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కేఎస్‌ భరత్‌ బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌(క్యాచ్‌, స్టంప్‌ అవుట్‌) లోనూ రాణించాడు. భరత్‌ను ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందే ఆర్సీబీ 20 లక్షల బేస్‌ ప్రైస్‌కు దక్కించుకుంది. 
చదవండి: Ashwin Vs Morgan: గొడవ పడ్డానా... ఎట్టకేలకు మౌనం వీడిన అశ్విన్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top