పంత్‌ దూకుడు ఢిల్లీకి లాభిస్తుందా?‌‌‌‌‌

IPL 2021: Delhi Capitals Full Squad And Match Fixures - Sakshi

ఢిల్లీ క్యాపిటల్స్‌:
కెప్టెన్‌: రిషబ్‌ పంత్‌
ఉత్తమ ప్రదర్శన: 2020 ఐపీఎల్‌ ఫైనలిస్ట్‌

గత సీజన్‌లో అంచనాలకు మించి రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ చివరి మెట్టుపై బోల్తా పడింది. అయ్యర్‌ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ 2020 ఐపీఎల్‌ సీజన్‌లో ఆరంభంలో వరుస విజయాలు సాధించి మంచి ప్రదర్శన కనబర్చిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్లేఆఫ్స్‌కు చేరింది. ఆ తర్వాత మొదటి క్వాలిఫయర్‌లో ముంబై చేతిలో ఓడిపోయింది. అనూహ్యంగా ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను ఓడించి తొలిసారి ఫైనల్‌కు చేరుకున్న ఆ జట్టు ముంబై ఇండియన్స్‌తో జరిగిన తుదిపోరులో పరాజయం పాలైంది.

కేకేఆర్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ కోసం క్లిక్‌ చేయండి

అయితే శ్రేయాస్‌ అయ్యర్‌ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా గాయపడడంతో మొత్తం ఐపీఎల్‌కు దూరమయ్యాడు. అయ్యర్‌ గైర్హాజరీలో రిషబ్‌ పంత్‌కు నాయకత్వ బాధత్యలు అప్పజెప్పింది. ఈసారి జరిగిన మినీ వేలంలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో పాటు ఐదుగురు స్వదేశీ క్రికెటర్లను దక్కించుకుంది.  స్టీవ్‌ స్మిత్‌, సామ్‌ బిల్లింగ్స్‌, టామ్‌ కరన్‌లను వేలంలో కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ తాను ఆడనున్న 14 లీగ్‌ మ్యాచ్‌ల్లో.. 5 మ్యాచ్‌లు కోల్‌కతా.. 4 మ్యాచ్‌లు అహ్మదాబాద్‌.. 3 మ్యాచ్‌లు ముంబై .. 2 మ్యాచ్‌లు చెన్నై వేదికగా ఆడనుంది.గత కొన్ని నెలలుగా మంచి దూకుడు మీద ఉన్న పంత్‌.. జట్టును ఎంతవరకూ సక్సెస్‌ వైపు నడుపుతాడో చూడాలి,. 

ఢిల్లీ క్యాపిటల్స్‌:
బ్యాట్స్‌మెన్‌: రిషబ్‌ పంత్‌ (కెప్టెన్, వికెట్‌ కీపర్‌), అజింక్య రహానె, పృథ్వీ షా, శిఖర్ ధావన్, షిమ్రాన్ హెట్‌మైర్‌, స్టీవ్ స్మిత్, సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), విష్ణు వినోద్ (వికెట్ కీపర్‌),రిపల్ పటేల్

బౌలర్లు: అవేష్ ఖాన్, ఇశాంత్ శర్మ, అన్రిచ్ నార్ట్జే , కగిసో రబడా, ప్రవీణ్ దుబే, అమిత్ మిశ్రా, ఉమేష్ యాదవ్, ఓం సిద్ధార్థ్, లుక్మాన్ మెరివాలా, టామ్‌ కరన్‌

ఆల్‌రౌండర్లు: లలిత్ యాదవ్, అక్సర్ పటేల్,రవిచంద్రన్ అశ్విన్, క్రిస్ వోక్స్, మార్కస్ స్టోయినిస్

ఐపీఎల్‌ 2021:భారీ అంచనాల నడుమ ఆర్‌సీబీ

తేది జట్లు వేదిక సమయం
ఏప్రిల్‌ 10 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్‌ సీఎస్‌కే ముంబై రాత్రి 7.30 గంటలు
ఏప్రిల్‌ 15 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్‌  రాజస్తాన్‌ రాయల్స్ ముంబై రాత్రి 7.30 గంటలు
ఏప్రిల్‌ 18 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్‌ కింగ్స్ ముంబై రాత్రి 7.30 గంటలు
ఏప్రిల్‌ 20 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌ చెన్నై రాత్రి 7.30 గంటలు
ఏప్రిల్‌ 25 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్ ..  చెన్నై రాత్రి 7.30 గంటలు
ఏప్రిల్‌ 27 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్‌ ఆర్‌సీబీ అహ్మదాబాద్‌ రాత్రి 7.30 గంటలు
ఏప్రిల్‌ 29 ఢిల్లీ క్యాపిటల్స్  వర్సెస్  కేకేఆర్ అహ్మదాబాద్‌ రాత్రి 7.30 గంటలు
మే 2 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్‌ పంజాబ్‌ కింగ్స్ అహ్మదాబాద్‌ రాత్రి 7.30 గంటలు
మే 8 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్‌ కేకేఆర్‌ అహ్మదాబాద్‌ సాయంత్రం 3.30 గంటలు
మే 11 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్‌ రాజస్తాన్‌ రాయల్స్ కోల్‌కతా రాత్రి 7.30 గంటలు
మే 14 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్‌ ఆర్‌సీబీ కోల్‌కతా రాత్రి 7.30 గంటలు
మే 17 ఢిల్లీ క్యాపిటల్స్  వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ కోల్‌కతా రాత్రి 7.30 గంటలు
మే 21 ఢిల్లీ క్యాపిటల్స్  వర్సెస్‌  సీఎస్‌కే‌ కోల్‌కతా రాత్రి 7.30 గంటలు
మే 23 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్‌ ముంబై ఇండియన్స్ కోల్‌కతా సాయంత్రం 3.30 గంటలు
Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top