ఐపీఎల్‌ 2021: ఆల్‌రౌండర్లే బలం.. బలహీనత

IPL 2021: Kolkata Night Riders Full Squad And Match Fixtures - Sakshi

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: 
కెప్టెన్‌: ఇయాన్‌ మోర్గాన్‌
విజేత: 2012, 2014

ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 11న సన్‌రైజర్స్‌తో ఆడనుంది. ఐపీఎల్‌ జట్లలో అన్నింటిలోకల్లా ఆల్‌రౌండర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నది కేకేఆర్‌లోనే. ఆ జట్టు బలం.. బలహీనత కూడా అదే. గతేడాది సీజన్‌లో దినేశ్‌ కార్తీక్‌ లీగ్‌ మధ్యలోనే కెప్టెన్‌ పదవి నుంచి వైదొలగడంతో మోర్గాన్‌ జట్టు బాధ్యతలు చేపట్టాడు. ఇక ఐపీఎల్‌ 13వ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 7 ఓటములతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది.

సీఎస్‌కే షెడ్యూల్‌ కోసం క్లిక్‌ చేయండి

అయితే నాలుగో స్థానం కోసం ఎస్‌ఆర్‌హెచ్‌తో చివరివరకు పోటీపడిన కేకేఆర్‌ రన్‌రేట్‌ తక్కువగా ఉండడంతో అర్హత సాధించలేకపోయింది. ఈసారి వేలంలో హర్భజన్‌ సింగ్‌, షకీబ్‌ ఆల్‌ హసన్‌, పవన్‌ నేగి, షెల్డన్‌ జాక్సన్‌, కరుణ్‌ నాయర్‌, బెన్‌ కటింగ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌లను తీసుకుంది. ఇక కేకేఆర్‌ తాను ఆడనున్న 14 లీగ్‌ మ్యాచ్‌ల్లో.. 5 మ్యాచ్‌లు బెంగళూరు..4మ్యాచ్‌లు అహ్మదాబాద్‌.. 3 మ్యాచ్‌లు చెన్నై.. 2 మ్యాచ్‌లు ముంబై వేదికగా ఆడనుంది.

కేకేఆర్‌ జట్టు: 
బ్యాట్స్‌మెన్‌: ఇయాన్‌ మోర్గాన్‌( కెప్టెన్‌‌)శుబ్‌మన్‌ గిల్, నితీష్ రానా, రింకు సింగ్ ,రారాహుల్ త్రిపాఠి, కరుణ్ నాయర్, దినేష్ కార్తీక్(వికెట్‌ కీపర్‌)షెల్డన్ జాక్సన్(వికెట్‌ కీపర్‌), టిమ్‌ షీఫెర్ట్‌(వికెట్‌ కీపర్‌)

ఆల్‌రౌండర్లు: ఆండ్రీ రస్సెల్, షకీబ్ అల్ హసన్ ,బెన్ కట్టింగ్, వెంకటేష్ అయ్యర్ , సునీల్ నరైన్‌

బౌలర్లు : కమలేష్ నాగర్కోటి, కుల్దీప్ యాదవ్, లోకీ ఫెర్గూసన్, ప్రసిధ్‌ కృష్ణ, సందీప్ వారియర్, శివం మావి,పాట్ కమిన్స్, పవన్ నేగి, వరుణ్ చక్రవర్తి, హర్భజన్ సింగ్, వైభవ్ అరోరా

కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌) మ్యాచ్‌ల షెడ్యూల్‌:

తేది  జట్లు వేదిక సమయం
ఏప్రిల్‌ 11 కేకేఆర్‌ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ చెన్నై రాత్రి 7.30 గంటలు
ఏప్రిల్‌ 13  కేకేఆర్‌ వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌ చెన్నై రాత్రి 7.30 గంటలు
ఏప్రిల్‌ 18 కేకేఆర్‌ వర్సెస్‌ ఆర్‌సీబీ‌‌‌ చెన్నై సాయంత్రం 3.30 గంటలు
ఏప్రిల్‌ 21 కేకేఆర్‌ వర్సెస్‌ సీఎస్‌కే ముంబై రాత్రి 7.30 గంటలు
ఏప్రిల్‌ 24 కేకేఆర్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ ముంబై రాత్రి 7.30 గంటలు
ఏప్రిల్‌ 26 కేకేఆర్‌ వర్సెస్‌ పంజాబ్‌ కింగ్స్ అహ్మదాబాద్‌ రాత్రి 7.30 గంటలు
ఏప్రిల్‌ 29  కేకేఆర్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్ అహ్మదాబాద్‌ రాత్రి 7.30 గంటలు
మే 3 కేకేఆర్‌ వర్సెస్‌ ఆర్‌సీబీ‌‌ అహ్మదాబాద్‌ రాత్రి 7.30 గంటలు
మే 8 కేకేఆర్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్ అహ్మదాబాద్‌ సాయంత్రం 3.30 గంటలు
మే 10  కేకేఆర్‌ వర్సెస్‌ ముంబై ఇండియన్స్ బెంగళూరు రాత్రి 7.30 గంటలు
మే 12 కేకేఆర్‌ వర్సెస్‌  సీఎస్‌కే బెంగళూరు రాత్రి 7.30 గంటలు
మే 15 కేకేఆర్‌ వర్సెస్‌ పంజాబ్‌ కింగ్స్ బెంగళూరు రాత్రి 7.30 గంటలు
మే 18 కేకేఆర్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ బెంగళూరు రాత్రి 7.30 గంటలు
మే 21 కేకేఆర్‌ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్ బెంగళూరు సాయంత్రం 3.30 గంటలు
Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top