Ruturaj Gaikwad: బ్రావో డాన్స్‌.. రుతుకు ఘన స్వాగతం... ఈ వీడియోలు చూశారా?

IPL 2021: CSK Winning Moments Grand Welcome To Ruturaj Gaikwad Videos - Sakshi

IPL 2021 Winner CSK Moments Goes Viral: ఐపీఎల్‌-2021 ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసినా సామాజిక మాధ్యమాల్లో ఆ సందడి ఇంకా తగ్గలేదు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్‌ విజేత చెన్నై సూపర్‌కింగ్స్‌ విజయోత్సాహానికి సంబంధించిన వీడియో అన్నింటికంటే హైలెట్‌గా నిలిచింది. మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ట్రోఫీ అందుకోగానే.. సీఎస్‌కే సంబరాలు అంబరాన్నంటాయి. దీపక్‌ చహర్‌ ధోనికి ఎదురెళ్లి ట్రోఫీని చేతుల్లోకి తీసుకోగా.. ‘ఛాంపియన్స్‌’ అంతా ఒక్కచోట చేరి ఫొటోలకు ఫోజులిచ్చారు. 


Courtesy: CSK Twitter/IPL

ఈ సందర్భంగా క్రికెటర్ల కుటుంబాలు ఒక్కసారిగా మైదానంలోకి వచ్చాయి. ధోని కుమార్తె జీవా, రాబిన్‌ ఊతప్ప కొడుకు తండ్రులతో కలిసి సందడి చేశారు. ఇక డ్వేన్‌ బ్రావో, గౌతమ్‌ కిష్టప్ప కలిసి కాసేపు స్టెప్పులేశారు. ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఆ తర్వాత అంతా కలిసి సెల్ఫీలు దిగారు. ఇక రుతురాజ్‌కు ఇంటి వద్ద ఘన స్వాగతం లభించిన వీడియో కూడా సీఎస్‌కే ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి మరి!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top