అలా చూసుకుంటే డికాక్‌ను తీసేయాల్సిందే: లారా

IPL 2021: Brian Lara Un Happy After MI Drop Ishan Kishan VS Rajasthan  - Sakshi

ఢిల్లీ: రాజస్తాన్‌​ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌కు ముంబై తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే ఇషాన్‌ కిషన్‌ను పక్కకు తప్పించడంపై విండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ బ్రియాన్‌ లారా తప్పబట్టాడు. బ్యటింగ్‌ సరిగా లేదని ఇషాన్‌ను తీసేస్తే.. డికాక్‌ను కూడా తీసేయాల్సిందే అని పేర్కొన్నాడు.

స్పోర్ట్స్‌ టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో లారా మాట్లాడుతూ.. '' ఇషాన్‌ కిషన్‌ను రాజస్తాన్‌తో మ్యాచ్‌కు పక్కకు తప్పించడం ఆశ్చర్యపరిచింది. అతనిలో మంచి హిట్టర్‌ దాగున్నాడు. రానున్న మ్యాచ్‌ల్లో అతను మ్యాచ్‌ విన్నర్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెపాక్‌ పిచ్‌లపై ఇషాన్‌ దారుణ ప్రదర్శన కనబరిచాడని జట్టులో నుంచి తొలిగించారంటే సమంజసం కాదు. అలా చూసుకుంటే  క్వింటన్‌ డికాక్‌ను కూడా తొలగించాల్సిందే.


Courtesy: IPL Twitter
అతను నాలుగు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 2,40,2,3 పరుగులతో మొత్తం 47 పరుగులు మాత్రమే చేశాడు. డికాక్‌ స్థానంలో క్రిస్‌ లిన్‌కు అవకాశం ఇస్తే బాగుండేది. డికాక్‌ గైర్హాజరీలో తొలి మ్యా,చ్‌ ఆడిన లిన్‌ 49 పరుగులతో ఆకట్టుకున్నాడు. కానీ తర్వాతి మ్యాచ్‌ల్లో అతనికి అవకాశాలు ఇవ్వలేదు. వరుసగా విఫలమవుతూ వస్తున్న డికాక్‌ను ఆడిస్తూనే ఉన్నారు. ఇషాన్‌ కిషన్‌ విషయంలో ముంబై ఇండియన్స్‌ వ్యవహరించిన తీరు తప్పు '' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఇషాన్‌ కిషన్‌ ఈ సీజన్‌లో ముంబై తరపున ఐదు మ్యాచ్‌లాడి 14.60 సగటుతో 73 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఇషాన్‌ కిషన్‌ మాత్రమే కాదు ముంబై మిడిలార్డర్‌ అనుకున్నంత గొప్పగా ఏం లేదు. మిడిలార్డర్‌ బలం లేకనే ముంబై ఓటములను కొని తెచ్చకుంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 2 గెలిచి.. మూడింట ఓడింది. ఇక రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 8 ఓవర్ల ఆట ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 71 పరుగులు చేసింది. డికాక్‌ 35, సూర్యకుమార్‌ 16 పరుగులతో 
క్రీజులో ఉన్నారు. అంతకముందు రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత  20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రాజస్తాన్‌ బ్యాటింగ్‌లో సంజూ సామ్సన్‌ 42 పరుగలతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. బట్లర్‌ 41, దూబే 35, జైస్వాల్‌ 32 పరుగులు చేశారు. 
చదవండి: 'చహర్‌ ఇదేం బాలేదు.. పాపం జైస్వాల్‌ను చూడు'
'కెప్టెన్సీ అతనికి కొత్త.. నా సలహాలు ఎప్పుడు ఉంటాయి'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top