
టోక్యో ఒలింపిక్స్‌లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు పోడియంపై పతకాలు తీసుకొని వెనక్కి వచ్చేయాలి తప్ప... అవకాశం దొరికింది కదా అని రాజకీయ ప్రసంగాలు, నిరసన ప్రదర్శలనలను చేపడితే ఇక వారి కథ కంచికి చేరినట్లే. ఈ మేరకు ఒలింపిక్స్‌లో క్రీడాకారుల నిరసన ప్రదర్శనలపై ఉన్న నిషేధాన్ని కొనసాగించేందుకే తాము నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) స్పష్టం చేసింది. ఒకవేళ క్రీడాకారులు నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని ఐఓసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టీ కొవెన్ట్రీ హెచ్చరించారు.