రవి బిష్ణోయ్ చెత్త రికార్డు.. టీ20ల్లో తొలి ప్లేయర్‌గా | Indias Ravi Bishnoi Becomes 1st Player In T20I History To Register Huge Unwanted Record In Loss vs England | Sakshi
Sakshi News home page

IND vs EMG: రవి బిష్ణోయ్ చెత్త రికార్డు.. టీ20ల్లో తొలి ప్లేయర్‌గా

Jul 5 2026 8:52 PM | Updated on Jul 5 2026 8:52 PM

Indias Ravi Bishnoi Becomes 1st Player In T20I History To Register Huge Unwanted Record In Loss vs England

టీమిండియా స్పిన్న‌ర్ ర‌వి బిష్ణోయ్ త‌నకు ల‌భించిన సువ‌ర్ణ అవ‌కాశాన్ని అందిపుచ్చుకోలేక‌పోయాడు. చాన్నాళ్ల త‌ర్వాత భార‌త జ‌ట్టులోకి వ‌చ్చిన బిష్ణోయ్.. మాంచెస్ట‌ర్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన రెండో టీ20లో ఘోర ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో ఒక్క వికెట్ కూడా ప‌డ‌గొట్ట‌కుండా 60 పరుగులు ఇచ్చాడు. 

అత‌డి చెత్త బౌలింగే భార‌త ఓట‌మికి ప్ర‌దాన కార‌ణంగా చెప్పుకోవాలి. . లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ జట్టుకు చివరి నాలుగు ఓవర్లలో 49 పరుగులు అవసరమయ్యాయి.  ఈ స‌మ‌యంలో 17 ఓవర్‌ వేసిన బిష్ణోయ్ 29 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ స్వ‌రూపామే మారిపోయింది. 

ఈ ఓవ‌ర్‌లో అత‌డు ఏకంగా రెండు నో బాల్స్.. రెండు ఫ్రీ హిట్‌ల‌ను బెత‌ల్ సిక్స‌ర్లుగా మ‌లిచాడు. ఇదే మ్యాచ్‌లో అంత‌కుముంద బిష్ణోయ్‌ ఓ నోబాల్ వేశాడు. దీంతో ఈ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ స్పిన్న‌ర్‌ ఓ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఒక అంతర్జాతీయ టీ20లో మూడు నోబాల్స్ వేసిన తొలి ఐసీసీ ఫుల్-మెంబర్ దేశ బౌలర్‌గా రవి బిష్ణోయ్ ఆ వాంఛనీయ రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. 

అంతేకాకుండా టీ20ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన మూడో భారత బౌలర్‌గా బిష్ణోయ్‌ నిలిచాడు. ఈ జాబితాలో  2020లో న్యూజిలాండ్‌పై శివమ్ దూబె 34 రన్స్, 2016లో వెస్టిండీస్‌పై స్టువర్ట్ బిన్నీ ఒకే ఓవర్‌లో 32 పరుగులు సమర్పించుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement