Hockey World Cup 2023: హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ బోణీ.. స్పెయిన్‌పై ఘన విజయం

Indian Hockey team beat Spain 2 0 in OPENER - Sakshi

భువనేశ్వర్‌ వేదికగా జరగుతోన్న హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ బోణీ కొట్టింది. గ్రూప్ ‘డి’లో భాగంగా స్పెయిన్‌తో జరిగిన పోరులో 2-0 గోల్స్ తేడాతో భారత్‌ విజయం సాధించింది. మ్యాచ్‌ ప్రారంభం నుంచే హర్మన్‌ప్రీత్ సింగ్ సేన అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఏ దశలోను ప్రత్యర్ధి జట్టుకు గోల్‌ సాధించే అవకాశం భారత డిఫెన్స్ ఇవ్వలేదు.

ముఖ్యంగా భారత గోల్ కీపర్ కృష్ణ పాఠక్ అద్భుతమైన డిఫెన్సింగ్‌ స్కిల్స్‌ను చూపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌ తరపున అమిత్ రోహిదాస్ 12వ నిమిషంలో తొలిగోల్‌ సాధించాడు. అనంతరం హార్దిక్ సింగ్ 26 నిమిషంలో రెండో గోల్‌ను భారత్‌కు అందించాడు.

ఇక భారత తన తదుపరి మ్యాచ్‌లో జనవరి 15న ఇంగ్లండ్‌తో తలపడనుంది. మరోవైపు ఇంగ్లండ్‌ జట్టు కూడా ఈ మెగా టోర్నీలో శుభారంభం చేసింది.  గ్రూపు-డిలోనే భాగంగా వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  5-0 గోల్స్ తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది.
చదవండి: మ‌హిళా క్రికెట‌ర్‌ అనుమానాస్పద మృతి.. అడవిలో మృతదేహం!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top