మహిళా క్రికెటర్ అనుమానాస్పద మృతి.. అడవిలో మృతదేహం!

ఒడిశా మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వైన్ అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన రాజశ్రీ.. శుక్రవారం(జనవరి 13) కటక్ సమీపంలోని ఓ దట్టమైన ఆడవిలో శవమై కన్పించింది. అథఘర్ ప్రాంతంలోని గురుడిఝాటియా అడవిలో చెట్టుకు వేలాడుతూ ఆమె మృతదేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
కాగా 26 ఏళ్ల రాజశ్రీ స్వైన్‌కు జనవరి 10న ప్రకటించిన ఒడిశా రాష్ట్ర మహిళల క్రికెట్ జట్టు తుది జాబితాలో చోటు దక్కలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఆ మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయింది. ఇక రాజశ్రీ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె కోచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆమె మృతదేహం అథఘర్ ఆడివిలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతదేహంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
చదవండి: Siddharth Sharma Death: భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం.. స్టార్ బౌలర్ మృతి
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు