R Praggnanandhaa: భారత యంగ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద పెను సంచలనం..

Indian Chess Grand Master Praggnanandhaa Shocks Anish Giri Enters Final - Sakshi

భారత యంగ్‌ గ్రాండ్‌మాస్టర్‌ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద పెను సంచలనం నమోదు చేశాడు. మెల్ట్‌వాటర్‌ చాంపియన్స్‌ చెస్‌ టూర్‌.. చెసెబుల్‌ ఆన్‌లైన్‌ మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో ఫైనల్లో అడుగపెట్టాడు. బుధవారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో డచ్‌ గ్రాండ్‌ మాస్టర​ అనిష్‌ గిరిని 3.5-2.5తో ఓడించి చెసెబుల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నీలో ఫైనల్‌ చేరిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. నాలుగు గేమ్‌ల పాటు 2-2తో సమానంగా ఉ‍న్నప్పటికి.. కీలకమైన టై బ్రేక్‌లో ప్రజ్ఞానంద విజృంభించి అనిష్‌గిరిపై సంచలన విజయం సాధించాడు.

కాగా తొలి గేమ్‌లో ఓడినప్పటికి ప్రజ్ఞానంద ఫుంజుకొని రెండోగేమ్‌లో విజయం సాధించాడు. మళ్లీ మూడో గేమ్‌లో అనిష్‌ గిరి మొదట ఆధిక్యంలో కనిపించినప్పటికి.. ప్రజ్ఞానంద ఎత్తుకు పై ఎత్తులు వేసి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కీలకమైన నాలుగో గేమ్‌లో అనిష్‌ గిరి విజయం సాధించడంతో 2-2తో మ్యాచ్‌ టై బ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌లో 33వ ఎత్తులో అనిష్‌ చేసిన తప్పు ప్రజ్ఞానందకు కలిసొచ్చింది.

మ్యాచ్‌ అర్థరాత్రి దాటిన తర్వాత కూడా సాగడంతో మ్యాచ్‌ పూర్తైన తర్వాత ప్రజ్ఞా.. ''నాకు ఉదయం 8:45 గంటలకు స్కూల్‌ ఉంది.. ఇప్పుడు సమయం ఉదయం రెండు దాటింది. స్కూల్‌కు వెళ్లగలనా'' అంటూ పేర్కొన్నాడు. కాగా ప్రజ్ఞానంద ప్రదర్శనపై కోచ్‌ ఆర్‌బీ రమేశ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ప్రజ్ఞానంద ఫైనల్‌ పోరులో చైనాకు చెందిన ప్రపంచ నెంబర్‌-2 డింగ్‌ లిరెన్‌తో ప్రజ్ఞానంద తలపడనున్నాడు. కాగా డింగ్‌ లిరెన్‌.. సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్‌ వన్‌ మాగ్నస్‌ కార్లసన్‌ను 2.5- 1.5తో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాడు.

చదవండి: కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. తిట్టిన నోరు మెచ్చుకునేలా చేసింది

బ్రూస్‌ లీ ఆరాధించిన భారత్‌ ఫహిల్వాన్‌ ఎవరో తెలుసా?

 చెస్‌ వరల్డ్‌ చాంపియన్‌కు మరోసారి షాకిచ్చిన 16 ఏళ్ల భారత కుర్రాడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top