
మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత్ కీలకపోరుకు సిద్ధమైంది. గ్రూప్–2లో భాగంగా తమ మూడో లీగ్ మ్యాచ్‌లో పటిష్టమైన ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీని టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. ప్రస్తుతం గ్రూప్–2లో భారత్, ఇంగ్లండ్ తాము ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందాయి.
ఇంగ్లండ్‌తో పోరులో నెగ్గాలంటే భారత అమ్మాయిలు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్, వెస్టిండీస్‌తో మ్యాచ్‌ల్లో విజయం సాధించే క్రమంలో ఒత్తిడికిలోనైన భారత్ ఈ మ్యాచ్‌లో తడబడితే మాత్రం ప్రతికూల ఫలితం వచ్చే అవకాశముంటుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే గ్రూపు-2 నుంచి సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
చదవండి: Badminton Asia Mixed Team Championships 2023: తొలిసారి సెమీస్‌లో భారత్