శ్రీలంకపై అద్భుత విజయం.. అమ్మాయిల సెలబ్రేషన్స్‌ మామాలుగా లేవుగా | Sakshi
Sakshi News home page

Women's Asia Cup 2022: శ్రీలంకపై అద్భుత విజయం.. అమ్మాయిల సెలబ్రేషన్స్‌ మామాలుగా లేవుగా

Published Sun, Oct 16 2022 9:37 AM

India Women bring up classy celebration as they win record 7th Asia Cup title - Sakshi

మహిళల ఆసియాకప్‌-2022ను భారత్‌ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. శనివారం శ్రీలంకతో జరిగిన ఫైన్లలో విజయం సాధించిన భారత్‌.. 7వ ఆసియాకప్‌ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ కీలక పోరులో తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులకే పరిమితమైంది.

భారత బౌలర్లలో రేణుకా సింగ్‌ మూడు వికెట్లు.. రాజేశ్వరీ గైక్వాడ్‌, స్నేహ్‌ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్‌ స్మృతి మంధాన(51) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేసింది.
సెలబ్రేషన్స్‌ అదుర్స్‌
ఇక శ్రీలంకపై అద్భుతవిజయం అనంతరరం భారత జట్టు అమ్మాయిలు వినూత్న రీతిలో సెలబ్రేషన్స్‌ జరుపుకున్నారు. మైదానంలోనే పంజాబీ డ్యాన్స్‌లు, కేరింతలతో ఊర్రూతలూగించారు.

కలర్ పేపర్స్‌ను ఒకరిపై ఒకరు చల్లుకుని భారత క్రికెటర్లు సంబురాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ ఉమెన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం భారత్‌ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


చదవండి: Women's Asia Cup 2022: ఛాంపియన్‌ భారత్‌కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..?

Advertisement

తప్పక చదవండి

Advertisement