జీరో నుంచి హీరో.. యువ క్రికెటర్లకు రోల్‌ మోడల్‌! ఈ వీరుడి గురుంచి తెలుసా? | ex-batter scored 5 ducks in first 6 innings, smashed 14000-plus runs | Sakshi
Sakshi News home page

జీరో నుంచి హీరో.. యువ క్రికెటర్లకు రోల్‌ మోడల్‌! ఈ వీరుడి గురుంచి తెలుసా?

Oct 26 2025 1:38 PM | Updated on Oct 26 2025 3:07 PM

ex-batter scored 5 ducks in first 6 innings, smashed 14000-plus runs

నవంబర్‌ 23, 1990.. ఆ రోజున ఇరవై ఏళ్ల యువ క్రికెటర్‌ శ్రీలంక తరపున టెస్టు అరంగేట్రం చేశాడు. ఎన్నో ఆశలతో తన అంతర్జాతీయ క్రికెట్‌ ప్రయణాన్ని ప్రారంభించిన ఆ యువ ఆటగాడికి.. తొలి మ్యాచ్‌లోనే తీవ్ర నిరాశ ఎదురైంది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు తొలి ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. 

డ్రెస్సింగ్‌ రూమ్‌లో అప్పటి కెప్టెన్‌తో పాటు హెడ్‌ కోచ్‌ అతడికి సపోర్ట్‌ నిలిచారు. కానీ రెండో ఇన్నింగ్స్‌లోనూ ఖాతా తెరకుండానే పెవిలియన్‌కు చేరాడు. అప్పటికే అతడు దేశవాళీ క్రికెట్‌లో సెంచరీలు మోత మ్రోగిస్తున్నప్పటికి.. అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం తన మార్క్‌ చూపించలేకపోయాడు. దీంతో అతడిని జట్టు నుంచి తీసేశారు. 

అరంగేట్రం ఒక పీడకలగా మారింది.  అయినప్పటికి శ్రీలంక తరపున ఆడాలన్న తన పట్టుదలను మాత్రం విడిచిపెట్టలేదు. దేశవాళీ క్రికెట్‌కు తిరిగి వెళ్లి  తీవ్రంగా శ్రమించి మరో అవకాశం కోసం ఎదురు చూశాడు. సరిగ్గా  19 నెలల తర్వాత అతడికి జాతీయ జట్టు మళ్లీ పిలుపు వచ్చింది.

మళ్లీ హార్ట్‌ బ్రేక్‌..
రెండో సారి కూడా అతడికి హార్ట్‌ బ్రేకింగ్‌ మూమెంట్‌ ఎదురైంది. మొదటి ఇన్నింగ్స్‌లో జీరో.. రెండు ఇన్నింగ్స్‌లో కేవలం​ ఒక్క పరుగు. అంటే అతడికి అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క పరుగు సాధించడానికి దాదాపు రెండు ఏళ్ల సమయం పట్టింది. దీంతో అతడిని మళ్లీ జట్టులోని నుంచి తొలిగించారు. అందరూ అతడి ఇంటర్నేషనల్‌ కెరీర్‌ ముగిసిందని, ఒత్తడిని తట్టుకోలేడని విమర్శల వర్షం​ కురిపించాడు. కానీ అతడు మాత్రం విమర్శలను పక్కన పెట్టి తన ప్రాక్టీస్‌పైనే దృష్టి పెట్టాడు. ‍

డొమాస్టిక్‌ క్రికెట్‌ తిరిగొచ్చిన అతడు ఈసారి మరింత కష్టపడ్డాడు. మళ్లీ అతడికి 21 నెలల తర్వాత లంక తరపున ఆడేందుకు అవకాశం​ వచ్చింది. ఈసారి ఎలాగైనా తన సత్తా నిరూపించుకోవాలని ఆ యువ ఆటగాడు సిద్దమయ్యాడు. కానీ ముచ్చటగా మూడో సారి కూడా అతడికి నిరాశే ఎదురైంది. 

మరో రెండు సున్నాలు అతడి ఖాతాలో చేరాయి. రెండు ఇన్నింగ్స్‌లలోనూ డకౌటయ్యాడు. అంటే తొలి ఆరు ఇన్నింగ్స్‌లలో అతడు కేవలం​ ఒక్క పరుగు మాత్రమే చేశాడు. మిగితా ఐదు ఇన్నింగ్స్‌లలో డకౌటయ్యాడు. దీంతో మరోసారి అతడిపై వేటు పడింది. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో చాలా మంది ఆటగాళ్లు ఇక చాలు అని తమ కెరీర్‌ను ముగించేస్తారు. కానీ అతడు మాత్రం వెనక్కు తగ్గలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడాతునే ఉన్నాడు.

పట్టు వదలని విక్రమార్కుడు
అతడు మళ్లీ దేశీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చి 36 నెలలు పాటు తీవ్రంగా శ్రమించాడు. అక్కడ మెరుగైన ప్రదర్శన చేసి దాదాపు మూడేళ్ల తర్వాత అతడు లంక టెస్టు జట్టులోకి వచ్చాడు. ఈసారి మాత్రం అతడి కృషి ఫలించింది. మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ సాధించి తన జైత్ర యాత్రను ప్రారంభించాడు. అక్కడి నుంచి అతడు వెనక్కి తిరిగి చూడలేదు. 

జీరో నుంచి హీరోగా మారిన అతడు ఏకంగా శ్రీలంక కెప్టెన్‌గా ఎదిగాడు. అతడే శ్రీలంక దిగ్గజం, మాజీ కెప్టెన్‌ మార్వన్‌ ఆటపట్టు. అతడి సక్సెస్‌ స్టోరీ ఎంతో మంది యువ క్రికెటర్లకు స్పూర్తి దాయకం. అంతర్జాతీయ  క్రికెట్‌లో తన రెండవ రన్‌ సాధించడానికి మార్వన్‌కు 6 సంవత్సరాలు పట్టింది.

ఇంత వైఫల్యం ఎదురైనా..అతడు మాత్రం గివప్‌ కాలేదు. అలా అని వేరే కెరీర్‌ చూసుకోలేదు. పడిన ప్రతీసారి బలంగా లేచిందుకు ప్రయత్నించాడు. ఫెయిల్‌ అవ్వడం ఎండ్‌ కాదు.. తిరిగి ప్రయత్నించడమే నిజమైన విజయమని మార్వన్‌ నిరూపించాడు.



ఆరు డబుల్‌ సెంచరీలు.. 
ఒక్క పరుగు సాధించడానికే ఇబ్బంది పడిన ఆటపట్టు.. తన టెస్టు కెరీర్‌లో ఏకంగా ఆరు డబుల్‌ సెంచరీలు సాధించాడు. 90 టెస్టులు ఆడిన మార్వన్‌ 39.02 సగటుతో 5502 పరుగులు సాధించాడు. అతడి పేరిట 16 టెస్టు సెంచరీలు, 6 ద్విశతకాలు ఉన్నాయి. వన్డేల్లో కూడా ఈ మాజీ కెప్టెన్‌ 11 సెంచరీల సాయంతో 8529 పరుగులు చేశాడు. మొత్తంగా ఆటపట్టు తన అంతర్జాతీయ కెరీర్‌లో 14,031 పరుగులు చేశాడు. అతడి కెప్టెన్సీలోనే 2004 ఆసియాకప్‌ టైటిల్‌ను లంక సొంతం చేసుకుంది.
చదవండి: IND vs SA: టీమిండియా పొమ్మంది.. కట్‌ చేస్తే! సెంచరీతో సెలక్టర్లకు వార్నింగ్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement