
స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు 16 మంది సభ్యుల కూడిన జట్టును జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రకటించింది. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ బ్రెండన్ టేలర్ నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి జింబాబ్వే టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు.
అవినీతి ఆరోపణల కేసులో మూడున్నరేళ్ల ఐసీసీ నిషేధాన్ని పూర్తి చేసుకున్న అతడు.. ఇటీవలే టెస్టు, వన్డే ఫార్మాట్‌లోకి తిరిగిచ్చాడు. ఇప్పుడు అతడు అనుభవం దృష్ట్యా టీ20 జట్టులో కూడా చోటిచ్చారు. ఇక అతడితో లంకతో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన స్టార్ ఆల్‌రౌండర్ సీన్ విలియమ్స్‌కు సైతం అవకాశమిచ్చారు.
ఈ జట్టుకు సికిందర్ రజా నాయకత్వం వహించాడు. అదేవిధంగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ట్రైసిరీస్‌లో విఫలమైన న్యూమాన్ న్యామ్‌హురి, వెస్లీ మాధవెరె, విన్సెంట్ మసెకేసాలపై సెలక్టర్లు వేటు వేశారు. అదేవిధంగా ఈ జట్టులో బ్రియాన్ బెన్నట్, రియాన్ బర్ల్‌కు సైతం ఛాన్స్ లభించింది.
సికిందర్ రజాతో పాటు వెల్లింగ్టన్ మసకడ్జా జింబాబ్వే జట్టు ఫ్రంట్ లైన్ స్పిన్నర్‌గా బంతి పంచుకోనున్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే జరగనున్నాయి. కాగా ఇప్పటికే రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో లంకేయులు క్లీన్ స్వీప్ చేశారు.
శ్రీలంకతో టీ20 సిరీస్‌కు జింబాబ్వే జట్టు ఇదే..
సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, బ్రాడ్ ఎవాన్స్, ట్రెవర్ గ్వాండు, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్‌టన్ మసకద్జా, టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజరబానీ,డియోన్ మైయర్స్, రిచర్డ్ నగరావ, బ్రెండన్ టేలర్, సీన్ విలియమ్స్
చదవండి: ఆసియాకప్‌లో లీడింగ్ వికెట్ టేకర్.. మూడేళ్లుగా జట్టుకు దూరం