Breadcrumb
Live Updates
Ind Vs Wi: ఇండియా వర్సెస్ వెస్టిండీస్.. అప్డేట్స్
బోణీ కొట్టిన టీమిండియా.. తొలి టీ20లో విండీస్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం
విండీస్ నిర్దేశించిన 158 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ(19 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (42 బంతుల్లో 35; 4 ఫోర్లు) శుభారంభాన్ని అందించగా మధ్యలో విరాట్ కోహ్లి (17), పంత్(8) నిరాశపర్చినప్పటికీ ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) క్రాకింగ్ ఇన్నింగ్స్ తో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అతనికి వెంకటేష్ అయ్యర్ (13 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సహకరించాడు. దీంతో టీమిండియా మరో 7 బంతులు మిగులుండగానే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టీ20 ఫిబ్రవరి 18న ఇదే వేదికగా జరగనుంది.
పంత్ చెత్త షాట్.. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్(8 బంతుల్లో 8) చెత్త షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. జట్టు స్కోర్ 114 పరుగుల వద్ద నుండగా కాట్రేల్ బౌలింగ్ లో ఒడియన్ స్మిత్ కు క్యాచ్ ఇచ్చి పంత్ వెనుదిరిగాడు. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 120/4. క్రీజ్ లో సూర్యకుమార్ యాదవ్(13), వెంకటేష్ అయ్యర్(5) ఉన్నారు.
మరోసారి నిరాశపరిచిన కోహ్లి.. టీమిండియా మూడో వికెట్ డౌన్
రెండు పరుగుల వ్యవధిలో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బౌండరీ బాది జోరు మీదున్నట్టు కనిపించిన విరాట్ కోహ్లి(13 బంతుల్లో 17; ఫోర్) మరోసారి తక్కువ స్కోరుకే ఔట్ అయ్యి నిరాశపరిచాడు. ఫేబియన్ అలెన్ బౌలింగ్ లో భారీ షాట్ కి ప్రయత్నించిన కోహ్లి.. బౌండరీ లైన్ వద్ద పోలార్డ్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి చేరాడు. ఫలితంగా టీమిండియా 95 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో పంత్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.
టీమిండియా రెండో వికెట్ డౌన్.. ఇషాన్ (35) ఔట్
93 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది.రోస్టన్ చేజ్ బౌలింగ్ లో ఫేబియన్ అలెన్ కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ (42 బంతుల్లో 35; 4 ఫోర్లు) ఔటయ్యాడు.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్(40) ఔట్
ధాటిగా ఆడుతూ భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (19 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రోస్టన్ చేజ్ బౌలింగ్ లో డీప్ మిడ్ వికెట్ బౌండరీ వద్ద ఒడియన్ స్మిత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా 64 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్ లో ఇషాన్ కిషన్ (26 బంతుల్లో 23; 3 ఫోర్లు), విరాట్ కోహ్లి ఉన్నారు.
ధాటిగా ఆడుతున్న హిట్ మ్యాన్.. గేర్ మార్చిన ఇషాన్
158 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(15 బంతుల్లో 38; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్(15 బంతుల్లో 18; 3 ఫోర్లు) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో టీమిండియా 5 ఓవర్లలో ఏకంగా 57 పరుగులు సాధించి, లక్ష్యం దిశగా దూసుకెళ్తుంది.
చెలరేగిన పూరన్.. విండీస్ స్కోర్ 157/7
మిడిలార్డర్ ఆటగాడు నికోలస్ పూరన్ (43 బంతుల్లో 61; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ద సెంచరీతో చెలరేగడంతో విండీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. హర్షల్ పటేల్ బౌల్ చేసిన ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఒడియన్ స్మిత్(4) రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో విండీస్ ఏడో వికెట్ కోల్పోయింది. ఆఖర్లో కెప్టెన్ కీరన్ పోలార్డ్ (19 బంతుల్లో 24 నాటౌట్; 2ఫోర్లు, సిక్స్) భారీ షాట్లకు ప్రయత్నించినప్పటికీ విండీస్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్ కైల్ మేయర్స్ 31 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్ చెరో 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, చహల్ తలో వికెట్ పడగొట్టారు.
పూరన్(61) ఔట్.. ఆరో వికెట్ కోల్పోయిన విండీస్
బౌండరీలు, సిక్సర్ల తో విరుచుకుపడిన పూరన్ (43 బంతుల్లో 61; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఎట్టకేలకు ఔట్ అయ్యాడు. హర్షల్ పటేల్ బౌలింగ్ లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి పూరన్ వెనుదిరిగాడు. 18 ఓవర్ల తర్వాత విండీస్ స్కోర్ 135/6గా ఉంది.
బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన పూరన్
విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్(38 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) వరుసగా సిక్సర్, బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఎండ్ లో ఉన్న పోలార్డ్(6) సైతం దూకుడుగా ఆడుతుండటంతో విండీస్ స్కోర్ 17 ఓవర్ల తర్వాత 125/5గా ఉంది.
ఐదో వికెట్ కోల్పోయిన విండీస్.. హోసేస్ (10) ఔట్
విండీస్ ఐదో వికెట్ కోల్పోయింది. అకీల్ హొసేన్(10) దీపక్ చాహర్ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్‌గా వెనుదిరిగాడు. దీంతో విండీస్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ప్రస్తుతం విండీస్ స్కోరు : 96/5.
నాలుగో వికెట్ డౌన్.. పావెల్ (2) ఔట్
విండీస్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో రౌమన్ పావెల్(2) వెంకటేశ్ అయ్యార్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రవి బిష్ణోయ్ మూడు ఓవర్లలో 10 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.
మూడో వికెట్ కోల్పోయిన విండీస్.. ఛేజ్(4) ఔట్
72 పరుగులు వద్ద విండీస్ మూడో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన ఛేజ్.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఎల్బీ వెనుదిరగాడు.
10 ఓవర్లకు విండీస్ స్కోర్: 71/2
10 ఓవర్లు ముగిసే సరికి విండీస్ రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. క్రీజులో పూరన్(27), ఛేజ్(4) పరుగులతో ఉన్నారు.
8 ఓవర్లకు విండీస్ స్కోర్: 55/2
ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి విండీస్ రెండు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. క్రీజులో పూరన్(17), ఛేజ్(1) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన విండీస్.. మైయర్స్(31) ఔట్
51 పరుగులు వద్ద కైల్ మైయర్స్ రూపంలో విండీస్ రెండో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన మైయర్స్ చాహల్ బౌలింగ్ ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి ఛేజ్ వచ్చాడు.
6 ఓవర్లకు విండీస్ స్కోర్: 44/1
ఆదిలోనే కింగ్ వికెట్ కోల్పోయినప్పటికీ విండీస్ నిలకడగా ఆడుతుంది. ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులో కైల్ మైయర్స్(31), పూరన్(8) పరుగులతో ఉన్నారు.
5 ఓవర్లకు విండీస్ స్కోర్: 35/1
ఐదు ఓవర్లు ముగిసే సరికి విండీస్ వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. ఓపెనర్ కైల్ మైయర్స్ నిలకడగా ఆడుతున్నాడు. క్రీజులో కైల్ మైయర్స్(23), పూరన్(7) పరుగులతో ఉన్నారు.
3 ఓవర్లకు విండీస్ స్కోర్: 18/1
మూడు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి విండీస్ 18 పరుగులు చేసింది. క్రీజులో కైల్ మైయర్స్(12), పూరన్(1) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన వెస్టిండీస్.. కింగ్(4) ఔట్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ తొలి ఓవర్ లోనే ఓపెనర్ బ్రాండన్ కింగ్ వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కూమార్ బౌలింగ్‌లో కింగ్(4) సూర్యకూమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తొలి ఓవర్ ముగిసే సరికి విండీస్ వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది.
తుది జట్లు ఇవే..
భారత తుది జట్టు:
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చహర్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, యజువేంద్ర చహల్.

వెస్టిండీస్ తుది జట్టు:
బ్రాండన్ కింగ్, కైల్ మేయెర్స్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), పావెల్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, అకీల్ హొసేన్, షెల్డన్ కాట్రెల్, ఫాబియన్ ఆలెన్.
టాస్ గెలిచిన రోహిత్.. ఫస్ట్ బౌలింగ్ మనదే..
వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి ఉత్సాహంతో ఉన్న భారత జట్టు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు.
Related News By Category
Related News By Tags
-
రవీంద్ర జడేజా కీలక నిర్ణయం
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025లో భాగమయ్యేందుకు సిద్ధమయ్యాడు. సొంత జట్టు సౌరాష్ట్ర తరపున జడ్డూ రెండు మ్యాచ్‌లు...
-
భారత క్రికెట్ అభిమానులకు ఈ ఏడాది 'చివరి కిక్'
మరో రెండు రోజుల్లో భారత క్రికెట్ అభిమానులకు ఈ ఏడాది చివరి కిక్ అందనుంది. దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో దాదాపుగా అందరూ టీమిండియా స్ట...
-
చాలా బాధపడ్డాను.. క్రికెట్ వదిలేయాలనుకున్నా: రోహిత్ శర్మ
నవంబర్ 19, 2023.. భారత క్రికెట్ అభిమానులకు గుండె కోత మిగిల్చిన రోజు. అదే రోజు రాత్రి కోట్లాది భారతీయుల కలలు, ఆశలు ఒక్క ఓటమితో అవిరయ్యాయి. వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీ ఆధ్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన టీమ...
-
పొగమంచు ఎఫెక్ట్: వెనుదిరిగిన ప్రధాని మోదీ హెలికాప్టర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని తాహెర్‌పూర్‌లో శనివారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీకి నిరాశ ఎదురైంది. ఆ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో, తక్కువ దృశ్యమానత కారణంగా ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాప్...
-
ఒకప్పుడు విలన్.. ఈసారి హీరో అవుతాడా?
టీ20 ప్రపంచకప్-2021లో ఆడింది మూడు మ్యాచ్‌లు.. పదకొండు ఓవర్ల బౌలింగ్‌లో 75 పరుగులు సమర్పించుకున్నాడు.. అయితే, కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఏకంగా 33 పరుగులు ఇచ్చుకున్న ...


